Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకు: విద్యార్థులకు రేబిస్‌పై అవగాహన

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్థానిక వెటర్నరీ ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆధ్వర్యంలో జువాలజీ విభాగం, రెడ్ రిబ్బన్ కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. జువాలజీ హెచ్‌ఓడీ డా. పి. బలరాం రేబిస్ వ్యాధి వ్యాప్తి, ప్రమాదాలపై వివరించారు. అధ్యాపకురాలు డీ.కే.వి.ఎస్. ప్రణీత వ్యాధి లక్షణాలను వివరించారు. రెడ్ రిబ్బన్ కమిటీ సభ్యురాలు డా. కే. స్వర్ణలత జంతువుల కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకా ప్రాముఖ్యతను వివరించారు. వెటర్నరీ సిబ్బంది విద్యార్థులకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మహిళా హక్కులపై అవగాహనకు కృష్ణకుమారికి ప్రశంసాపత్రం

అరకులోయ కేజీబీవీ పాఠశాల అధ్యాపకురాలు, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్‌పర్సన్ డా. కృష్ణకుమారి అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. పేదలు, మహిళల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. కృష్ణకుమారిని పలువురు అభినందించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మహిళా హక్కులపై అవగాహనకు కృష్ణకుమారికి ప్రశంసాపత్రం

అరకులోయ కేజీబీవీ పాఠశాల అధ్యాపకురాలు, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్‌పర్సన్ డా. కృష్ణకుమారి అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. పేదలు, మహిళల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. కృష్ణకుమారిని పలువురు అభినందించారు.

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

అరకులోయ మండలం ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఆదివారం సాయంత్రం బైక్‌ ప్రమాదం జరిగింది. యండపల్లివలస నుంచి అరకులోయ వైపు వస్తున్న హీరో షైన్ బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ కొన్ని మీటర్ల దూరంలో పడిపోయింది. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో నందు సినిమా షూటింగ్

అరకులోయ పరిసర ప్రాంతాల్లో ఢీ షో యాంకర్, నటుడు నందు హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఆదివారం నిర్మల కాన్వెంట్‌లో దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్, హీరో నందుపై కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయన కథానాయికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా, సినిమా టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకు: ఈ నెల 17న మాదల లో పీజీఆర్ఎస్

అరకులోయ మండలం, మాదల పంచాయితీ కేంద్రంలో ఈ నెల 17న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్, తాహశీల్ధార్ రాజా శ్రీధర్ ఆదివారం తెలిపారు. ఈ పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మాదల పీడీఓ, స్వర్ణ గ్రామ సిబ్బంది పీజీఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు

ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్న ఏపీఓ జగదీశ్వరరావు

80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని పాడేరులో నిర్వహించిన వేడుకల్లో అరకులోయ మండల వీబీజీ రామ్‌జీ ఏపీఓ జే. జగదీశ్వరరావు ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్నారు. విధుల్లో ప్రతిభ, అంకితభావంతో పనిచేస్తూ పథకం అమలులో చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఆయనకు ఉత్తమ పనితీరు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని జగదీశ్వరరావు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: రాయగడ డివిజన్ నుండి విశాఖకు బదిలీ చేయాలని వినతి

ఈస్ట్ కోస్ట్ జోన్ లోని రాయగడ డివిజన్ని లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైల్వే ఉద్యోగులను సౌత్ ఈస్ట్ జోన్ లోని విశాఖ డివిజన్‌కు బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అరకులోయకు వచ్చిన అరకు ఎంపీ డా. గుమ్మా తనూజారాణి ని కలిసి వినతిపత్రం అందజేశారు. డీపీఆర్‌లో డివిజన్ ఎంపిక అవకాశం ఉన్నప్పటికీ, డివిజన్ మార్పు సమయంలో ఉద్యోగుల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వివిధ శాఖల్లో సుమారు 3,000 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు

ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్న ప్లాంటేషన్ సూపర్వైజర్

80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని పాడేరులో నిర్వహించిన వేడుకల్లో అరకు క్లస్టర్ ప్లాంటేషన్ సూపర్వైజర్ వంతాల రంగారావు ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్నారు. విధుల్లో ప్రతిభ, అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల అమలులో చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి రంగారావుకు ఉత్తమ పనితీరు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని రంగారావు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకులోయ లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అరకులోయ మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్ లో జరిగిన వేడుకలలో అరకు ఎంపీ డా గుమ్మా తనూజ రాణి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రంజపల్లి ఉషారాణి, పెదలబుడు పంచాయితీ కార్యాలయంలో అరకులోయ ఎంపీడీఓ, పంచాయితీ ప్రత్యేక అధికారి వీసం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ సభ్యులు దురియ ఆనంద్ కుమార్, లబుడుబారి భీమరాజు, స్థానిక నాయకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది, క్లాప్ మిత్రాలు, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.