80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని పాడేరులో నిర్వహించిన వేడుకల్లో అరకులోయ మండల వీబీజీ రామ్జీ ఏపీఓ జే. జగదీశ్వరరావు ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్నారు. విధుల్లో ప్రతిభ, అంకితభావంతో పనిచేస్తూ పథకం అమలులో చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఆయనకు ఉత్తమ పనితీరు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని జగదీశ్వరరావు తెలిపారు.

ఉత్తమ పనితీరు అవార్డు అందుకున్న ఏపీఓ జగదీశ్వరరావు