Saturday, 26 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

కొండచరియలు విరిగిపడటంతో నేడు అరకు రైళ్లు రద్దు

రాయగడ డివిజన్‌లోని మాలిగుర–ఛత్రపుట్‌ స్టేషన్ల మధ్య కొండచరియ విరిగిపడటంతో అరకు మీదుగా నడిచే విశాఖ–కిరండుల్‌–విశాఖ ప్యాసింజర్‌ (58501/58502), ఎక్స్‌ప్రెస్‌ (18515/18516) రైళ్లను ఈ నెల 26న రద్దు చేశారు. ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ప్రమాద బాధితుడిని పరామర్శించిన సివేరి అబ్రహం

అరకులోయ మండలం మాదల పంచాయతీ పరిధి ములియగలుగు గ్రామానికి చెందిన కొర్ర మొగ్గొ గత వారం బైక్ ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, సివేరి సోమ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ సివేరి అబ్రహం బాధితుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఫౌండేషన్ తరపున రూ.1,000 ఆర్థిక సహాయం అందించారు. ప్రమాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అభిమాన్, సివేరి ప్రశాంత్ కుమార్, పాపన్న, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: తుఫాను బాధితులను ఆదుకోవాలి: సిపిఎం మాజీ సర్పంచ్

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గృహాల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం డుంబ్రిగూడ ఎమ్మార్వో కె.శంకర్రావుకు వినతిపత్రం అందజేశారు. గసబ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడ, కూడ, గసబ, నువ్వగూడ, చిమిలిగూడ, కుసుమ కెంద గ్రామాల్లో పేద గిరిజనుల గృహాలు పాక్షికంగా, కొన్ని పూర్తిగా కూలిపోయాయని తెలిపారు. సుమారు 20 కుటుంబాలు నష్టపోయాయని, కొన్ని ఇళ్లలో వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. బాధితులకు వెంటనే సహాయం అందించాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకర ఎదుగుదల

నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని అరకులోయ మండలం, గన్నెల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2,116 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయించారు. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. మిగిలిన పిల్లలకు అక్టోబర్‌ 5న మాత్రలు వేయిస్తామని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ట్రెక్కింగ్

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వ్యాలీలో శుక్రవారం ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాల్లో భాగంగా అరకు వ్యాలీ డిగ్రీ కళాశాల మైదానం నుంచి బోడుగూడ హిల్స్ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ సాగింది. అరకు అడ్వాన్స్‌డ్ అడ్వెంచర్ ట్రైనింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు అడ్వెంచర్ టీములకు చెందిన 23 మంది పాల్గొన్నారు. జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు, ఎంపీడీవో వీసం ప్రసాద్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రెక్కింగ్‌తో యువతలో శారీరక దృఢత్వం, ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అధికారులు తెలిపారు. అరకు ప్రకృతి అందాలు, అడ్వెంచర్ టూరిజం అవకాశాలను విస్తృతంగా ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: నులిపురుగుల నిర్మూలనతో పిల్లల ఆరోగ్యానికి మేలు

నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం తగ్గి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని డాక్టర్ కుమార్‌రత్న తెలిపారు. శుక్రవారం కిల్లోగుడ పీహెచ్‌సీ పరిధిలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. కిల్లోగుడ, జామగుడ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ జానకమ్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ శారదా బోందుగుడ గ్రామంలో కిల్లో జయరాం, పెదలబుడు పంచాయతీ కరసలిగుడ గ్రామంలో పూజారి గోపి ఇళ్లు భారీ వర్షాలకు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించి, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. నష్టానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ళు

డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలోని దేముడువలస, కొరొంజిగుడ, మలింగవలస గ్రామాల్లో మాజీ సర్పంచ్ పొట్టంగి రాంప్రసాద్ పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి నష్ట వివరాలు తెలుసుకున్నారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలను అధికారులు గుర్తించి, తక్షణ సహాయం, తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: తగ్గిన ముసురు.. ప్రారంభమైన ఈదురుగాలులు

అల్పపీడనం తీరం దాటడంతో నాలుగు రోజులుగా కొనసాగిన ముసురు వాతావరణం కాస్త తెరిపిచ్చింది. అయితే తుఫాను ప్రభావంతో అరకు పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్‌ వైర్లను తాకడంతో లైన్లు ట్రిప్ అవుతున్నాయని, దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావం, లక్ష్యాలను వివరించారు. ముఖ్యఅతిథి ఆర్. హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే సేవా దృక్పథాన్ని అలవర్చుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు డాక్టర్ జి. సుధీర్, వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న 2026–27 కార్యక్రమాలు, ‘స్వయం సమృద్ధ భారతదేశం కోసం యువత’ థీమ్‌ ప్రాధాన్యతను వివరించారు. ఉత్తమ 30 మంది వాలంటీర్లకు సర్టిఫికెట్లు, పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్యఅతిథిని, ప్రిన్సిపాల్‌ను ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.