వార్త ముఖ్యాంశాలు
- పాడేరు/అరకులోయ, నవంబర్ 6: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, వేగవంతం చేయాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఆర్.కుర్మనాధ్ అధికారులను ఆదేశించారు.
- శుక్రవారం ఆయన పాడేరు, అరకు వ్యాలీ, అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించారు.
- కౌంటింగ్ హాళ్లలో టేబుళ్ల అమరిక, బ్యాలెట్ బాక్సుల భద్రత, సీసీటీవీ కెమెరాల నిఘా, లైటింగ్, మైక్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ ఏజెంట్లకు కేటాయించిన సీటింగ్ ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేశారు.
పాడేరు/అరకులోయ, నవంబర్ 6: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, వేగవంతం చేయాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఆర్.కుర్మనాధ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన పాడేరు, అరకు వ్యాలీ, అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో టేబుళ్ల అమరిక, బ్యాలెట్ బాక్సుల భద్రత, సీసీటీవీ కెమెరాల నిఘా, లైటింగ్, మైక్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ ఏజెంట్లకు కేటాయించిన సీటింగ్ ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేశారు.
అనంతరం ఎన్నికల అధికారులతో సమావేశమై లెక్కింపు రౌండ్లు, సిబ్బంది నియామకం, ఫలితాల నమోదు విధానం, కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి లోటుపాట్లు లేకుండా లెక్కింపును శాంతియుతంగా పూర్తి చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వెలుపల తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో జిల్లా సర్వే అధికారి ఈశ్వర దొర, జిల్లా టూరిజం అధికారి చలపతి, స్థానిక రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గుజ్జిలి కొండబాబు, పోలీసు అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన