అరకులోయ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర స్థాయి బృందం ఆకస్మికంగా సందర్శించింది. ఎన్హెచ్ఎం జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) డి.ప్రకాశరావు, రాష్ట్ర ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.దేవి, ట్రైనింగ్ కన్సల్టెంట్ ఎ.వాసుబాబు అన్ని వార్డులు, లేబర్ రూమ్, ఐపీహెచ్ఎల్, ఎస్ఎన్సీయూ, ఏబీడీఎం రిజిస్ట్రేషన్ విభాగం, ఫార్మసీని క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సేవలు, నిర్వహణ, పారిశుద్ధ్యం, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పరిశుభ్రత, విభాగాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని అభినందించారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఆసుపత్రి కృషిని ప్రశంసించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎల్.రాము, ఆర్ఎంవో డాక్టర్ శివ బాలాజీ, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ అప్పారావు, గైనకాలజిస్ట్ డాక్టర్ శోభారాణి, డీఎంహెచ్వో డాక్టర్ రియాజ్ బేగ్ పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన