Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు సాక్షి కథనని ఖండించిన ముప్పిడి నాగేష్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు సాక్షి కథనని ఖండించిన ముప్పిడి నాగేష్ రెడ్డి

రైతు ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరం!

సాక్షి కథనంలో అవాస్తవాలు ప్రచురించారు – ముప్పిడి నాగేశ్వరరెడ్డి తీవ్ర ఖండన

రెడ్డిగూడెం: తాడిగూడెం గ్రామంలో కౌలు రైతు పాటెన శివరామారావు మృతిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, వాస్తవాలకు విరుద్ధంగా వార్తలు ప్రచురించడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు.

సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంలో రైతు అప్పుల బాధతో, పొలం ఎండిపోవడంతో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొనడం పూర్తిగా అవాస్తవమని ఆయన మండిపడ్డారు.

వాస్తవానికి శివరామారావు సాగు చేసిన పొలం పచ్చగా కళకళలాడుతోందని, పంట బ్రహ్మాండంగా పండిందని, మరో వారంలో పంట చేతికి వచ్చే పరిస్థితి ఉందని నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దురదృష్టవశాత్తూ మరణించడం ఎంతో బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

అయితే ఒక వ్యక్తి మరణాన్ని రాజకీయాలకు అనుకూలంగా మలుచుకుని, ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఒక కుటుంబంలో జరిగిన విషాదాన్ని రాజకీయ విమర్శలకు అస్త్రంగా మార్చడం మానవత్వం అనిపించుకోదు. వార్తలు ప్రచురించే ముందు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మీడియాపై ఉందని నాగేశ్వరరెడ్డి హితవు పలికారు.

ఈ సందర్భంగా సాక్షి కథనాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాడి ఉమామహేశ్వరరావు, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు సాక్షి కథనని ఖండించిన ముప్పిడి నాగేష్ రెడ్డి

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు సాక్షి కథనని ఖండించిన ముప్పిడి నాగేష్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *