వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 12(పున్నమి తెలుగు దినపత్రిక ): పామూరు మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డికి కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు.
- ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి, ఆమె తండ్రి బైరెడ్డి జయరామిరెడ్డి లను శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
- ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలతో జడ్పీటీసీగా విజయం సాధించడం సంతోషకరమని పేర్కొంటూ, భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
పామూరు, నవంబర్ 12(పున్నమి తెలుగు దినపత్రిక ): పామూరు మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డికి కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి, ఆమె తండ్రి బైరెడ్డి జయరామిరెడ్డి లను శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలతో జడ్పీటీసీగా విజయం సాధించడం సంతోషకరమని పేర్కొంటూ, భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నుచ్చుపొద మాజీ సర్పంచ్ బాలిబోయిన గురుబ్రహ్మం, పామూరు మండల టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు బాలిబోయిన బాలబ్రహ్మం, నుచ్చుపొద గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామేపల్లి సూర్య, గొర్ల బ్రహ్మయ్య, రామకృష్ణ తదితర టీడీపీ నాయకులు పాల్గొని డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డికి అభినందనలు తెలియజేశారు.