Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: ఉప్పొంగుతున్న గెడ్డలు.. అప్రమత్తంగా ఉండాలి

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అరకు గిరిజన ప్రాంతంలో గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డుంబ్రిగుడ మండలం గసబ పంచాయతీ పరిధిలోని టికిలిబెడ్డ, కంగారుసోల గ్రామాల మధ్యనున్న కూడా గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకు: సివేరి సోమ ఆశయాలకు ప్రతిరూపంగా ఫౌండేషన్

అరకులోయ మాజీ ఎమ్మెల్యే, నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివంగత సివేరి సోమ 8వ వర్థంతిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సివేరి సోమ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు సివేరి సోమ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తనయుడు సివేరి అబ్రహం తెలిపారు. ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య, వైద్యం, సామాజిక సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: సివేరి సోమ ఆశయాలకు ప్రతిరూపంగా ఫౌండేషన్

అరకులోయ మాజీ ఎమ్మెల్యే, నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివంగత సివేరి సోమ 8వ వర్థంతిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సివేరి సోమ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు సివేరి సోమ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తనయుడు సివేరి అబ్రహం తెలిపారు. ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య, వైద్యం, సామాజిక సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: కిసాన్ మోర్చా మన్యం జిల్లా ఇన్‌చార్జ్‌గా ఎంపీటీసీ వంతల దేవదాసు

పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా వంతల దేవదాసు నియమితులయ్యారు. ఈ మేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అధికారికంగా ప్రకటించారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా దేవదాసు రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డుంబ్రిగూడ మండలం సాగర పంచాయతీ బీజేపీ ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలను ఏర్పాటు చేసి, రైతులను సంఘటితం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయికి చేరువ చేయాలని ఆకాంక్షించారు. కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవదాసుకు శుభాకాంక్షలు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

మీ భూమి–మీ హక్కు’తో రైతులకు భరోసా : దొన్నుదొర

హుకుంపేట మండలం భీమవరం, చిట్టెంపాడు గ్రామాల్లో మంగళవారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ సియ్యారి దొన్నుదొర పాల్గొని రైతులకు ఫొటోలతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతుల్లో భరోసా పెరిగిందన్నారు. రైతుల భూములకు మరింత రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తమ భూములపై రైతులకు హక్కులు, భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూముల వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి : బిస్పీ

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శెట్టి లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం పాడేరులో కలెక్టర్ టి. నిశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్‌లో వర్షాలు లేక రైతులు పంటలు సాగు చేయలేకపోయారని, సాగుచేసిన వరి పంటలు సైతం ఎండిపోతున్నాయని తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

స్ధానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి: దొన్నుదొర

డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ పెద్ద అంజోడ గ్రామంలో సోమవారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి డా. సియ్యారి దొన్నుదొర ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో గిరిజన ప్రాంత అభివృద్ధికి పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని కోరారు. రైతుల వద్దకే అధికారులు వచ్చి పాస్‌పుస్తకాలు అందించడం మార్పుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: బాలల వికాసానికి పౌష్టికాహారం చాలా ముఖ్యం

అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ కేంద్రంలో సోమవారం పోషణ్‌ మాసం కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ రామకృష్ణమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీలావణ్య, ఎంపీడీఓ ప్రసాద్, ఎంఆర్ఓ రాజా శ్రీధర్, ఎంఈఓ-2 భారతీరత్నం పాల్గొన్నారు. పోషకాహారం, బాలల వికాసంపై ర్యాలీ నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు మాతృ వందన పథకం ప్రయోజనాలు పొందాలని, అంగన్‌వాడీ పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు శాంతి, ధన, సంగీత ఉన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: సుంకరమెట్టలో స్వచ్ఛతా హి సేవా ర్యాలీ

అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట గ్రామపంచాయతీలో సోమవారం స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీసం ప్రసాద్, తహసీల్దార్ జి. రాజశ్రీధర్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీ లావణ్య, ఎంఈఓ భారతీరత్నం, ఏటీఓ వెంకట్రావు, పంచాయతీ డెవలప్‌మెంట్ అధికారి పి. శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛతే సేవ, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది అనే సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్థానికులు, యువత పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరిలో ఎంపీటీసీ సభ్యులకు సన్మానం

అనంతగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తడబారికి మితుల అధ్యక్షతన మండల పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొన్నారు. మండల అభివృద్ధికి సహకరించిన అధికారులకు ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో అనంతగిరికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర తెలిపారు. 2021-26 పదవీకాల ఎంపీటీసీ సభ్యుల సేవలను గుర్తిస్తూ ఘనంగా శాలువాలతో సత్కరించారు. జడ్పీటీసీ గంగరాజు, ఎంపీడీవో ప్రభాకర్, ఎంఆర్‌ఓ వీరభద్రచారి, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.