Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో ఘనంగా గురజాడ జయంతి

అరకులోయ, సెప్టెంబర్ 22: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి మాట్లాడుతూ గురజాడ రచనలు సామాజిక చైతన్యానికి దర్పణమని, “దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్” అనే సందేశం నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, కవిత, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

కుజుభంగి వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం

డుంబ్రిగూడ మండలం గుంటసీమ నుంచి కుజభంగి వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును విజయనగరం జోన్ చైర్మన్, అరకు టీడీపీ ఇన్చార్జి డా. సియ్యారి దొన్ను దొర సోమవారం ప్రారంభించారు. పాడేరు నుంచి అరకు-గుంటసీమ మీదుగా కుజభంగి వరకు సర్వీసు నడుస్తుందని, గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు వస్తాయని అన్నారు. ప్రయాణికులతో కలిసి ఆయన ప్రయాణించారు. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి శెట్టి చిరంజీవి, తుడుము సుబ్బారావు, కిల్లో ఆనందరావు, పాంగి సుబ్బారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: స్వచ్ఛత.. పచ్చదనంపై అవగాహన

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డా. ఆర్. కుసుమకుమారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. “పరిశుభ్రత మన బాధ్యత–పచ్చదనం మనందరి బాధ్యత” అనే సందేశంతో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల పరిసరాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రజలకు సందేశాలు అందించారు. స్వచ్ఛమైన కళాశాల, పచ్చని పరిసరాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో డా. సి.హెచ్. మురళీకృష్ణ, సభ్యులు డా. బి. సుభాన్‌, డా. కె. లక్ష్మీ, కె. అఖిల్‌తేజ, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: లోతేరు సంతలో పోస్టల్ పథకాలపై అవగాహన ర్యాలీ

అరకులోయ మండలం లోతేరు వారపు సంతలో తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ తపాలా జీవిత భీమా (RPLI), పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) మరియు పోస్టాఫీస్ పొదుపు పథకాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి కిషోర్ పాల్గొన్నారు. బ్యానర్‌తో నిర్వహించిన ర్యాలీ ద్వారా పథకాల ప్రయోజనాలపై స్థానికులకు అధికారులు వివరించారు. తపాలా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకు: అంగన్‌వాడీ సిబ్బందికి పోషణపై అవగాహన

అరకులోయ: పోషణ మాసం–2026లో భాగంగా శనివారం మండల పరిషత్ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య పోషకాహారం అందించడం, రక్తహీనత నివారణ, తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పాలు, గుడ్లు, ఎండు ఖర్జూరం, చిక్కీ, రాగిపిండి, మల్టీ గ్రెయిన్ పౌడర్, కూరగాయలు, పండ్లను సూచించిన విధంగా వినియోగించుకోవాలని సూచించారు. శిశువులకు రెండేళ్ల వరకు తల్లిపాలు అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని వివరించారు. కార్యక్రమం సీడీపీఓ లక్ష్మీ లావణ్య ఆధ్వర్యంలో జరగగా, ఎంపీడీఓ వీసం ప్రసాద్, స్ధానిక పిర్యాధుల కమిటీ చైర్మన్ డా కమ్మిడి కృష్ణకుమారి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. SEEDS ప్రతినిధులు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: రోడ్డు పూర్తికాక గ్రామాలకు అవస్థలు

డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయితీ పరిధిలోని బొడ్లమామిడి, నిట్టమామిడి, డొకిరిపాడు గ్రామాలకు కలుపుతున్న రోడ్డు పనులు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల క్రితమే రోడ్డుకు మెటల్ వేశారు. కానీ తారు వేయకపోవడంతో వర్షాలకు మెటల్ రాళ్లు, కింద మట్టి కొట్టుకుపోయింది. ప్రస్తుతం రోడ్డుపై రాళ్లు తేలి ఘాటీ ప్రాంతంలో వాహనాలు నడపడం దుర్భరంగా మారింది. గర్భిణీలు, వృద్ధులు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్, 108 వాహనాలు సైతం గ్రామాలకు చేరలేని పరిస్థితి. రోడ్డును వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఎంపీటీసీ సభ్యుల ప్రత్యేక సమావేశం

అరకువ్యాలీ: మండల పరిషత్‌ 2021–26 పదవీకాలానికి సంబంధించి ప్రత్యేక సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ రంజాపల్లి ఉషారాణి అధ్యక్షతన జరిగింది. ఎంపీడీవో వీసం ప్రసాద్, వైస్‌ ఎంపీపీలు కిల్లో రామన్న, కొర్రా సుమాంజలి, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్‌ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చించి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఆత్మీయంగా సత్కరించారు. విజయనగరం ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్‌ చైర్మన్‌ సియ్యారి దొన్నుదొర కార్యక్రమంలో పాల్గొన్నారు. 2021–26 పదవీకాలంలో సభ్యులు అందించిన సహకారం, ప్రజాసేవల్లో భాగస్వామ్యాన్ని అభినందించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మహిళా డిగ్రీ కళాశాల సమస్యలపై ఎంపీకి వినతి

పాడేరులో శుక్రవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అరకులోయ ప్రిన్సిపాల్‌ డా.ఆర్‌.కుసుమకుమారి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎంపీ డా.గుమ్మా తనూజారాణిని కలిసి కళాశాల సమస్యలపై మెమొరాండం సమర్పించారు. వర్షాకాలంలో విద్యార్థులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు నిర్మించాలని, కళాశాల చుట్టూ ఉన్న గుట్టలు, రాళ్లను చదును చేసి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, ప్రవేశద్వారం వద్ద నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వినతి కి ఎంపీ సానుకూలంగా స్పందించి కళాశాలను సందర్శించి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, చెట్టి వినయ్‌ సహకరిస్తామని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: కొండపోడు పట్టాలు పంపిణీ చేయాలి

అరకులోయ మండలం బోండం పంచాయతీలో సబ్‌-డీఎల్‌సీ ఆమోదం పొందిన 64 మంది ఆదివాసీ రైతులకు తక్షణమే కొండపోడు పట్టాలు పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. సీపీఎం మండల నాయకుడు గత్తుం బుజ్జిబాబు మాట్లాడుతూ, 2024 నుంచి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, పట్టాలు లేక రైతులు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. సకాలంలో డీఎల్‌సీ సమావేశాలు నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా కొండపోడు రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జి.కృష్ణారావు, జి.అప్పారావు, జి.జగత్‌రాయ్, జి.రంభ, బి.వీరస్వామి, పి.సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

ఎస్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలి : అరకు ఎంఈఓ-1

అరకులోయ మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సన్నద్ధం కావాలని ఎంఈఓ వి.త్రినాథరావు సూచించారు. గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు ఎన్నికల నిర్వహణపై సన్నద్ధత శిక్షణ ఇచ్చారు. సెప్టెంబర్‌ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అదేరోజు నూతనంగా ఎన్నికైన ఎస్‌ఎంసీ సభ్యులు, చైర్మన్‌ ప్రమాణ స్వీకారం, తొలి సమావేశం నిర్వహించాలన్నారు. సెప్టెంబర్‌ 18న పాఠశాల నోటీసు బోర్డులో ఓటర్ల జాబితా ప్రదర్శించి, 25న అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు టీ.మోహన్‌రావు, పద్మావతి, ఏటీడబ్ల్యూఓ రమణ, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.