Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకు: చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విజయవంతం

అరకులోయ లో జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో చెకుముకి మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, తార్కిక ఆలోచన, పరిశీలనా శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పరీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన MEO–2 వి. త్రినాథ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ ఆధారాలతో నిజానిజాలను తెలుసుకునే అలవాటు పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. మోహన్‌రావు విద్యార్థులను అభినందించారు. పాఠశాల స్థాయిలో 8, 9, 10 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మండల స్థాయి పరీక్షలో పాల్గొన్నారు. ముగ్గురు విద్యార్థులు ఒకే సమాధాన పత్రంపై పరస్పరం చర్చించుకుంటూ సమాధానాలు రాశారు. పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు, JVV ప్రతినిధులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

పెదబయలు: మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలపై అవగాహన

పెదబయలు EMRSలో శనివారం విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్‌పర్సన్ డా. కంబిడి కృష్ణకుమారి, పెదబయలు ఎస్‌ఐ వెంకటేష్, ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొని మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌ను గుర్తించి అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమస్య ఎదురైతే వెంటనే పెద్దలకు తెలియజేయాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: వర్ర లో పోషణ్‌ మాసం కార్యక్రమం

అరకులోయ మండలం, శిరగం పంచాయతీ వర్రా గ్రామంలో పోషణ్‌ మాసం కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ లక్ష్మీ లావణ్య, సూపర్వైజర్ లక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్త బంగారమ్మ‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషకాహారం, బాలల వికాసంపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు ప్రధానమంత్రి మాతృ వందన పథకం ప్రయోజనాలను పొందాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే వేడి ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

ముంచింగిపుట్టు: భూమి కాదు.. ఆదాయమే పెన్షన్‌కు ప్రామాణికం

ఆదివాసీల పెన్షన్ అర్హతను భూమి విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించడం అన్యాయమని కాంగ్రెస్ ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం అన్నారు. ముంచింగిపుట్టు లో ఆయన మాట్లాడుతూ..పోడు, కొండ, మెట్ట భూములకు సాగునీరు, దిగుబడి తక్కువగా ఉంటాయని తెలిపారు. కుటుంబ వాస్తవ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని, తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: కూడ లో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని స్పందనలో వినతి

డుంబ్రిగూడ మండలం గసబ పంచాయతీ కూడ రెవెన్యూ గ్రామంలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ పాంగి సురేష్‌కుమార్, ప్రజలు పాడేరు స్పందనలో జాయింట్ కలెక్టర్ శ్రీపూజకు వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాల ప్రజలు 20 కిలోమీటర్ల దూరంలోని లోగిలి డిపోకు వెళ్తున్నారని తెలిపారు. పోడు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని జేసీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన ర్యాలీ

అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాలతో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు మట్టి విగ్రహాలే మేలని ప్రిన్సిపాల్ సూచించారు. విద్యార్థినులు నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బందికి ప్రిన్సిపాల్ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

పాడేరు: గురుకుల విద్యార్థినుల సాహస ప్రదర్శన

పాడేరు గురుకుల మహిళా కళాశాలలో మూడు నెలల సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలో భాగంగా శుక్రవారం విద్యార్థినులు సాహస ప్రదర్శన నిర్వహించారు. బైక్‌ను చేతులపై నుంచి రెండు రౌండ్లు నడిపిస్తూ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ఆదేశాలతో శిక్షణ కొనసాగుతున్నట్లు పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ పాండు రాజు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, అధ్యాపకులు, పీడీ నిర్మల పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: 16 MPTC స్థానాల ఓటర్ల జాబితాల ప్రదర్శన

అరకులోయ మండలంలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్ధం ఎంపీడీవో వీసం ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో కేవీఏ సత్యనారాయణ ప్రదర్శించారు. మండలంలోని 16 MPTC స్థానాలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లోనూ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: అటవీ అమర వీరులకు ఘన నివాళి

అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన అటవీ అమర వీరుల సేవలు చిరస్మరణీయమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం అరకులోయలో జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎఫ్ఆర్వో కోటేశ్వరరావు, సిబ్బంది అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్మరణ కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

అల్లూరి సీతారామరాజు

పీవీటీజీలకు ఇళ్లు ఎందుకు మంజూరు చేయలేదు? అధికారులను నిలదీసిన డా. సియ్యారి దొన్ను దొర

అరకులోయలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో కాశీపట్నం పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన పీవీటీజీ మహిళలు తమకు ఇళ్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర అధికారులను నిలదీశారు. అర్హతలు ఉన్నప్పటికీ గృహాలు ఎందుకు మంజూరు చేయలేదో కారణాలు చెప్పాలని కోరారు. ప్రభుత్వం పీవీటీజీలకు ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం తగదన్నారు. అర్హులందరికీ వెంటనే గృహాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే డ్రైనేజీ, కొత్త పెన్షన్ల దరఖాస్తులు, వీధిలైట్లు, తాగునీటి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.