Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకు: పెన్షన్ దరఖాస్తు గడువు పొడిగించాలి

ఎన్‌టీఆర్‌ భరోసా కొత్త పెన్షన్ల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకుడు కుమిడి రమేష్ కోరారు. అరకులోయ మండలం, మాదల పంచాయతీలో సుమారు 100 మంది అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్, ఓటర్‌ కార్డు తదితర పత్రాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్‌ సిగ్నల్‌ సమస్యలతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించలేకపోతున్నారని పేర్కొన్నారు. వరుస సెలవుల నేపథ్యంలో గడువు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానం

అనంతగిరి మండలం, కొత్తూరు పంచాయతీ పరిధిలో అర్హులైన గిరిజనులు ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లకు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సచివాలయ డిఏ కె. ప్రేమ్ కుమార్ శుక్రవారం కోరారు. ఆధార్, కులధ్రువీకరణ, విద్యుత్ బిల్లు, ఆధార్ కు అనుసంధాన ఫోన్ నంబర్ తో సచివాలయానికి రావాలన్నారు. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ, వికలాంగులు సదరం సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. మహిళలకు 50 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: వైసీపీలో ఊపందుకున్న చేరికలు

అరకు నియోజకవర్గంలో వైసీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. అరకు వ్యాలీ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో వివిధ మండలాలకు చెందిన 120 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీ కండువా కప్పుకున్నారు. పెదబయలు నుంచి 50 మంది, అనంతగిరి నుంచి 20 మంది, హుకుంపేట నుంచి 30 మంది, ముంచంగిపుట్టు నుంచి 20 మంది పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వ పాలనపై విసుగు చెంది వైసీపీలో చేరుతున్న వారికి స్వాగతం పలుకుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని, రానున్న స్థానిక ఎన్నికల్లో వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజ రాణి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, ఇతర నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు

అరకులోయ, సెప్టెంబర్ 10: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయాలని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషిని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజన సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. 2029లో జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. సమావేశంలో ఎంపీ గుమ్మా తనూజరాణి, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు

అరకులోయ, సెప్టెంబర్ 10: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయాలని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషిని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజన సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. 2029లో జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. సమావేశంలో ఎంపీ గుమ్మా తనూజరాణి, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

జీవో 69 రద్దు చేయాలి : ఆదివాసీ గిరిజన సంఘం

విజయవాడలో షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డిని కలిసి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, సహాయ కార్యదర్శి ఏ. అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న వినతిపత్రం అందించారు. మారికవలస గురుకుల విద్యాసంస్థను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే జీవో 69ను రద్దు చేయాలని, సెంటర్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. మారికవలస ఇంగ్లీష్ మీడియం పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, నీట్, ఐఐటీ, ఎంసెట్ కోచింగ్‌ను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఏటపాక మండలం కోతులగుట్ట హాస్టల్‌లో మలేరియా మాత్రల ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి

మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్ కేశవరావు పిలుపునిచ్చారు. గురువారం గిరిజన మ్యూజియం వద్ద విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన ప్రతిమల వల్ల జలాలు కలుషితమవుతాయని తెలిపారు. అనంతరం ర్యాలీ చేసి వ్యాపారులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మీ, లచ్చన్న, అధ్యాపకులు పాల్గొన్నారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకు: రాజధాని జంక్షన్‌లో పోలీసుల వాహన తనిఖీలు

అరకులోయ మండలం రాజధాని జంక్షన్ వద్ద అరకు ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతలు, గంజాయి అక్రమ రవాణా నివారణకు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీటు బెల్ట్ లేని వారికి జరిమానా విధించారు. ఎస్ఐ త్రినాధరావు, పీసీ రామరాజు, హోంగార్డ్ నాగరాజు, కూంబింగ్ బెటాలియన్ పాల్గొన్నారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

కురిడి పంచాయతీలో వైసీపీకి ఎదురు దెబ్బ

డుంబ్రిగుడ మండలం, కురిడి పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గోరాపూర్, పిట్టమర్రిగూడ, బిల్లాపుట్టు, గొడ్డిగూడ గ్రామాల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు. టీడీపీ అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర కండువాలు వేసి ఆహ్వానించారు. చంద్రబాబు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి చూసి చేరామని వారు తెలిపారు. ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని దొన్ను దొర భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరిలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం

చంద్రబాబు అక్రమ అరెస్టుకు 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా టీడీపీ అరకు ఇన్చార్జి డా. సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో బుధవారం అనంతగిరి మండలంలో ‘నిజం గెలిచింది’ పేరిట దీపాలు వెలిగించారు. కక్షపూరిత అరెస్టుకు ప్రజలు 2024లో సమాధానం ఇచ్చారని, కోర్టు, ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన తెలియజేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందని ఆయన ఆరోపించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.