Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

డిగ్రీ ప్రవేశాలకు సర్టిఫికెట్లతో రావాలి: అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్

అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం డిగ్రీలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఓఎండీసీలో కేటాయించిన అలాట్మెంట్ లెటర్‌తో కళాశాలకు రావాలని ప్రిన్సిపాల్ డా. సీహెచ్ కేశవరావు తెలిపారు. అలాట్మెంట్ లెటర్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. తొలి దశలో కళాశాలకు 319 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు

కొత్తబల్లుగూడలో PGRS: 25 వినతులు స్వీకరణ

అరకులోయ మండలం కొత్తబల్లుగూడ గ్రామంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. MPDO వీసం ప్రసాద్, తహసీల్దార్ రాజశ్రీధర్, SI మల్లేశ్వరావు పాల్గొన్నారు. ప్రజల నుంచి పంచాయతీరాజ్ – 5, RWS – 5, విద్యుత్ – 4, రెవెన్యూ – 3, హౌసింగ్ – 2, అగ్రికల్చర్ – 2, గిరిజన సంక్షేమం, ఇరిగేషన్, ICDS, వైద్యం ఒక్కొకటి చొప్పున మొత్తం 25 వినతులు అందాయని ఎంపీడీఓ తెలిపారు. వినతులను సత్వర పరిష్కారానికి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

అల్లూరి సీతారామరాజు

నూతన పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ : అరకు ఎంపీడీఓ

అరకులోయ మండలంలో నూతన ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఈ నెల 16వ తేదీలోగా స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. దరఖాస్తుతో ఆధార్, రైస్‌కార్డు లేదా ఆదాయ ధ్రువపత్రం సమర్పించాలని సూచించారు. పింఛన్ కేటగిరీకి అనుగుణంగా వయస్సు, భర్త మరణం, దివ్యాంగత్వం తదితర ధ్రువపత్రాలు అందజేయాలన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఈకేవైసీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం అర్హత పరిశీలన, భౌతిక ధ్రువీకరణ పూర్తిచేసి ప్రభుత్వ అనుమతి, బడ్జెట్ లభ్యత మేరకు పింఛన్లు మంజూరవుతాయని పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు

శ్రీ సంపత్ సాయి ట్రేడర్స్‌ను ప్రారంభించిన సివేరి అబ్రహం

అరకులోయ మండలం, రవ్వలగుడ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సంపత్ సాయి ట్రేడర్స్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిర్వాహకులు పాంగి బలరాం, పి.వి.వి. ప్రశాద్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఐరన్, సిమెంట్, ఇటుకలు, ఎంఎస్ పైపులు తదితర నిర్మాణ సామగ్రి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపారం విజయవంతంగా సాగి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేత ద్రౌపది, స్థానికులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి.. డీఎస్పీ పిలుపు

డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, దాన్ని అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి అన్నారు. అరకులోయ మండలం సుంకరమెట్టలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరకు సీఐ ఏ. కోటేశ్వరరావు, ఎస్సై టి. మల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటులో నిబంధనలు పాటించి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. రోడ్డు భద్రత, మహిళల రక్షణపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.

అల్లూరి సీతారామరాజు

అరుకు మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాల మేరకు నేడు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కుసుమకుమారి పేర్కొన్నారు. పైస్ ప్రిన్సిపల్ పట్టాసి చలపతిరావు కూడా సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రపై మాట్లాడారు. విద్యార్థులు తమకు స్ఫూర్తినిచ్చిన అధ్యాపకులపై ప్రసంగాలు చేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు, అధ్యాపకులు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ గురువుల సేవలు అమూల్యమైనవని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

ప్రధాన మంత్రి మాతృవందన యోజన పై అరకు సీడీపీఓ ప్రచారం

ప్రధాన మంత్రి మాతృవందన యోజన పై అవగాహన కల్పించేందుకు అరకులోయ సీడీపీఓ లక్ష్మీ లావణ్య గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో పర్యటించారు. గర్భిణీ, బాలింత మహిళలకు మొదటి సంతానానికి ₹5000, రెండవ సంతానం అమ్మాయి అయితే ₹6000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. గర్భధారణ నమోదు, టీకాలు, ఆసుపత్రి ప్రసవాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లి, శిశు ఆరోగ్యం కొరకు పోషకాహార అవసరంపై అవగాహన కల్పించారు.

అల్లూరి సీతారామరాజు

పర్యావరణ పరిరక్షణ, గర్భిణీల వైద్య సేవలపై CCR వినతులు

పాడేరు, సెప్టెంబర్ 03: ప్రజా సమస్యలపై సీసీఆర్ జిల్లా కమిటీ గురువారం జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాయింట్ కలెక్టర్ కు వినతి ఇస్తూ, వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాలను నిషేధించాలని కోరారు. దీనివల్ల జలవనరుల కాలుష్యం తగ్గుతుందన్నారు. అలాగే డీఎం&హెచ్ఓ కు వినతి ఇస్తూ, గర్భిణీలకు రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు ఒకే ఆసుపత్రిలో అందేలా చర్యలు తీసుకోవాలని, రిఫరల్స్ వల్ల గర్భిణీలు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కె.కామరాజు, జి.కామేశ్వరరావు, పి.చిరంజీవి, కె.శివ, ఎం.కొండబాబు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

గ్రామసభల్లో ఓటర్ల జాబితా ఆమోదం: అరకు ఎంపీడీఓ వీసం ప్రసాద్

అరకులోయ మండలంలోని 14 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ఆమోదానికి గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. మొత్తం 164 వార్డుల్లో 42,725 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 39,805 ఎస్టీ, 212 ఎస్సీ, 1,470 బీసీ ఓటర్లుగా గుర్తించామన్నారు. గ్రామసభల్లో జాబితాలను చదివి వినిపించి, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందిస్తామని గన్నెల గ్రామసభలో స్పెషల్ ఆఫీసర్ గా పాల్గొన్న ఎంపీడీఓ అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.