Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం, మై భారత్‌ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌. కేశవరావు మాట్లాడుతూ మాతృభాష గొప్పతనాన్ని, తెలుగు భాష పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు బురిడీ ఆనందరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొని మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలుగు అధ్యాపకుడు ఎస్‌. సోంబాబు, పీడీ అప్పారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ కే. నిర్మల, సోర్స్‌ ఇన్‌చార్జి వై. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

మారికవలస గురుకులాన్ని కొనసాగించాలి: పాచిపెంట చిన్నస్వామి

అరకులోయ, ఆగస్టు 28: 22 ఏళ్లుగా కొనసాగుతున్న మారికవలస గిరిజన గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని ఏపీ కాంగ్రెస్‌ పీసీసీ డెలిగేట్‌ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్‌ చేశారు. 480 మంది గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి తరలించిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ కోసం గురుకులాన్ని ఖాళీ చేయించడం సరికాదన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అల్లూరి సీతారామరాజు

గిరిజన చట్టాలు, హక్కులను పటిష్టంగా అమలు చేయాలి : రేగం చాణిక్య

గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. అరకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో-3కు ప్రత్యామ్నాయ జీవో, గిరిజన యువతకు 100 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాల హామీలను నెరవేర్చాలన్నారు. 1/70, ఎల్‌టీఆర్‌ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మారికవలస గిరిజన పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజనులతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: 90 శాతం రాయితీపై 1317 క్వింటాళ్ల రాజ్మా విత్తనాలు

అరకు డివిజన్ పరిధిలోని అరకులోయ, అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాలకు 1,317 క్వింటాళ్ల రాజ్మా విత్తనాలు వచ్చాయని ఏడీఏ మోహన్‌రావు తెలిపారు. 90 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఎకరాకు 20 కిలోల విత్తనాలు, విత్తన శుద్ధికి కిలో ట్రైకోడెర్మా విరిడి అందిస్తామన్నారు. అరకులోయ మినహా మిగిలిన మండలాల్లో సోమవారం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్ జిరాక్స్‌లతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: సీఎం సభకు భారీ ఏర్పాట్లు పూర్తి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అరకులోయలో పర్యటించనున్న నేపథ్యంలో గన్నెలలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌, వాహనాల పార్కింగ్‌, తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు సిద్ధం చేశారు. కలెక్టర్‌ నిషాంతి, జేసీ పూజ, ఐటీడీఏ పీవో వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. దొన్ను దొర, తేజోవతి పర్యవేక్షించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఎం ఏకలవ్య పాఠశాల, సంజీవిని కార్యక్రమం, రచ్చబండలో పాల్గొని సభలో ప్రసంగించనున్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: బరెంగిబందలో సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి

అరకు వేలి మండలం బస్కి పంచాయతీ బరెంగిబంద గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడిచినా సౌకర్యాలు లేక వర్షాకాలంలో నీరు నిలిచిపోయి దోమలు పెరుగుతున్నాయని, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. పర్యటనలో సీపీఎం నాయకులు కొర్రా సుబ్బారావు, కె. దేవన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

మారికవలస గురుకుల విద్యార్థులకు ఎంపీ తనూజ రాణి అండ

విశాఖపట్నం మధురవాడలోని మారికవలస గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపు నిర్ణయాన్ని అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి తీవ్రంగా వ్యతిరేకించారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. గురుకులాన్ని మారికవలసలోనే కొనసాగించి, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రత్యామ్నాయ భవనంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చలిలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు దుప్పట్లు, శాలువాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు

మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను కొనసాగించాలి : ఆదివాసీ గిరిజన సంఘం

మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. అరకువేలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జిబాబు, నాయకులు బి.దశరధ్ లు మాట్లాడుతూ 480 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను రద్దు చేయకూడదన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు అదనపు లేదా అద్దె భవనాలు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థి, గిరిజన, కార్మిక, ఉద్యోగ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

అల్లూరి సీతారామరాజు

రాఖీ కట్టిన అక్క.. ఆశీర్వాదం తీసుకున్న తమ్ముడు

రాఖీ పౌర్ణమి సందర్భంగా డుంబ్రిగుడ మండలం అరకు సంతలో అక్కాతమ్ముళ్ల ఆత్మీయత కనిపించింది. అక్క తన తమ్ముడికి రాఖీ కట్టి ప్రేమాభిమానాలను చాటుకుంది. అనంతరం తమ్ముడు అక్క ఆశీర్వాదం తీసుకున్నాడు. సంతలో చోటుచేసుకున్న ఈ ఆప్యాయ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ఈ ఘటన ప్రతీకగా నిలిచింది.

అల్లూరి సీతారామరాజు

ఆమూరులో పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణంపై కేంద్ర బృందం పర్యవేక్షణ

హుకుంపేట, ఆగస్టు 27: తీగలవలస పంచాయతీ ఆమూరు గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీ ఇళ్ల నిర్మాణ పనులను కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. హౌసింగ్ ఏఈ దేవానంద్‌తో కలిసి నిర్మాణ ప్రగతి, పూర్తయిన ఇళ్లు, పెండింగ్ బిల్లులను పరిశీలించారు. యూనిట్ కాస్ట్ రూ.2.39 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష అందించాలని పేసా ప్రెసిడెంట్ పాంగి చిరంజీవి, క్లస్టర్ ఇంచార్జి కే. కామరాజు కోరారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బృందం తెలిపింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.