Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

100% రిజర్వేషన్‌పై సీఎం స్పష్టత ఇవ్వాలి : ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

అరకువేలి, ఆగస్టు 27: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 29న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం గన్నెల పర్యటన సందర్భంగా ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు రద్దు చేయాలని, పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు పెంచిన లక్ష రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కె. జగన్నాథం, మండల నాయకులు సహదేవ్ పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

మారికవలస గురుకులం యథావిధిగా కొనసాగించాలి: రేగం చాణక్య

విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలలోని గిరిజన విద్యార్థులను రాత్రికి రాత్రే తరలించడంపై వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అరకులోయ లో గురువారం మాట్లాడారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అల్లూరి సీతారామరాజు

ప్రపంచ సరస్సుల దినోత్సవం: సరస్సుల పరిరక్షణపై అవగాహన

అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోటనీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సరస్సుల ప్రాముఖ్యత, నీటి వనరుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైస్‌ ప్రిన్సిపాల్ కె. నిర్మల, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్ వై. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

రాష్ట్ర స్థాయి క్రీడల్లో అరకు విద్యార్థినికి తృతీయ స్థానం

తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026 క్రీడా పోటీల్లో అరకు వ్యాలీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని తామర్ల జ్యోతిక (III బీకాం) జావెలిన్‌ త్రో విభాగంలో తృతీయ స్థానం సాధించింది. జ్యోతికను కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఆర్. కుసుమకుమారి, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎల్. జ్యోతి అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

అల్లూరి సీతారామరాజు

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు

అరకు వ్యాలీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాల మేరకు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు విభాగం ఆధ్వర్యంలో గురువారం వివిధ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, కవితా రచన, వక్తృత్వం, పద్యాలు, ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా తెలుగులో మాట్లాడే పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు.

అల్లూరి సీతారామరాజు

బస్కి పంచాయతీలో సీపీఎం నాయకుల పర్యటన.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

అరకులోయ మండలం బస్కి పంచాయతీలో మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు పర్యటించి సమస్యలను పరిశీలించారు. గ్రామాల్లో బురద, నీటి నిల్వలతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి నాలుగు జతల దోమతెరలు పంపిణీ చేయాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మొర్రిగూడలో 150 కుటుంబాల నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పశువులకు లంపీ వ్యాధి నివారణ టీకాలు

అరకులోయ మండలం పానిరంగిని గ్రామంలో లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు పశువులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించినట్లు మండల పశుసంవర్ధక అధికారి డా. శీనయ్య తెలిపారు. మొత్తం 186 పశువులకు టీకాలు వేశారు. ఐదు పశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి, 12 అనారోగ్య పశువులకు చికిత్స అందించారు. ఈ కార్యక్రమంతో 18 మంది రైతులు లబ్ధి పొందారు. లైవ్ స్టాక్ అధికారి సాంబశివరావు, విఏహెచ్ఏ లు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

పాడేరు: ఆదివాసీ కిరాణా స్టోర్‌ ప్రారంభించిన జీసీసీ చైర్మన్

పాడేరు మండలం గుత్తులపుట్టు పంచాయతీ సంతబయలులో ITDA నిధులతో ఏర్పాటు చేసిన ఆదివాసీ కిరాణా జనరల్ స్టోర్‌ను రాష్ట్ర GCC చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. గిరిజనులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నిత్యావసర సరుకులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధి మెరుగుదలకు ఇటువంటి దుకాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో AMC వైస్ చైర్మన్ జ్ఞాన ప్రకాశ్, MPTC కొమ్మ రామ, రాష్ట్ర ST సెల్ కార్యదర్శి సుబ్బారావు, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్య పఠనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సీహెచ్. కేశవరావు అధ్యక్షత వహించారు. మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అధ్యాపకుడు ఎస్. సోంబాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలకు ఆగస్టు 29న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కే నిర్మల ఎన్ఎస్ఎస్ పిఓలు విజయలక్ష్మి, అనితకుమారి, అధ్యాపకులు వి కామేశ్వరరావు, ఎస్ఎ దొన్ను, ఎస్ సురేష్, విద్యార్ధిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: జీవ ఎరువులపై రైతులకు శిక్షణ

అనంతగిరి మండలం చిలకలగెడ్డ రైతు సేవా కేంద్రంలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో జీవ ఎరువుల వినియోగంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. అరకు ఏడీఏ మోహనరావు పాల్గొనగా, ఏఓ రంగారావు జీవ ఎరువుల రకాలు, వినియోగ విధానం, ప్రయోజనాలను వివరించారు. వీహెచ్ఏ రాంబాబు, ఎంపీఈఓ జ్యోతి పాల్గొన్నారు. జీవ ఎరువులతో నేల సారవంతత, పోషకాల లభ్యత పెరుగుతాయని, సాగు వ్యయం తగ్గుతుందని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.