Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకు: ఈ నెల 24న హోటల్, రెస్టారెంట్ యజమానులతో సమావేశం

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు బాధ్యతాయుత పర్యాటకంపై చర్చించేందుకు ఈనెల 24న అరకులోయ లోని పున్నమి అతిథిగృహాంలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పట్టాసీ చలపతిరావు తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హోటల్, రెస్టారెంట్ యజమానులు, ట్రావెల్ ఏజెన్సీలు విధిగా హాజరుకావాలన్నారు. ఏపీటీడీసీ, ఐటీడీఏ పర్యాటక శాఖ, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల అమలు, పర్యాటక సేవల మెరుగుదల, శాఖల మధ్య సమన్వయం, పర్యాటకుల భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు.

అల్లూరి సీతారామరాజు

పాడేరులో 24న కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన

పాడేరు కలెక్టరేట్‌ లో ఈనెల 24న ఉదయం 11 గంటలకు కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డా సీహెచ్‌ కేశవరావు సూచించారు. విద్యార్థులు కార్యక్రమానికి హాజరై ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన పొందాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

ప్రత్యేక పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛత కమిటీ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సిహెచ్. కేశవరావు ఆదేశాల మేరకు వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు వై. విజయలక్ష్మి, ఎం. అనితకుమారి మాట్లాడుతూ పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెంపొందించడమే లక్ష్యమన్నారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కళాశాల పరిసరాలను శుభ్రపరిచి, పండ్ల మొక్కలు నాటారు.

అల్లూరి సీతారామరాజు

విద్యార్థులకు కాఫీ బోర్డు విద్యా ఉపకార వేతనాలు

కాఫీ బోర్డు ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యా ఉపకార వేతనాలు, ప్రతిభావంతుల అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్‌ఎల్‌ఓ రమేష్ తెలిపారు. ఇంటర్, పాలిటెక్నిక్వి ద్యార్థులకు రూ.5,000 చొప్పున ఉపకార వేతనం,10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన బాలుడు, బాలికకు రూ.2,500 చొప్పున ప్రోత్సాహక అవార్డు అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను సెప్టెంబర్ 8, 2026లోగా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కాఫీ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాలకు కాఫీ బోర్డు కార్యాలయాలను సంప్రదించాలని ఎస్ఎల్ఓ సూచించారు.

అల్లూరి సీతారామరాజు

రహదారి పనులు పూర్తిచేస్తా: కిడారి శ్రావణ్ కుమార్

అనంతగిరి: జీనాబాడు, పినకోట పంచాయతీల్లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ శుక్రవారం పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రహదారి, పాఠశాల భవనం, అంగన్‌వాడీ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. తండ్రి, మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మంజూరు చేసిన రహదారి పనులు పూర్తిచేయడం తన బాధ్యతని హామీ ఇచ్చారు. 80 ఏళ్లుగా నాయకులు గ్రామానికి రాలేదని, తొలిసారి ఇంటింటికీ వచ్చి సమస్యలు తెలుసుకున్నారని గ్రామస్థులు తెలిపారు. మండల కార్యదర్శి గాలి నరేంద్ర, ఏ.బుజ్జిబాబు, బిడ్డ లక్ష్మణ్, డి.శ్యామ్, నిర్మల, గండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అరకు విద్యార్థినులు

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు పాడేరులో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. కబడ్డీలో కె.రాణి, పి.కల్యాణి, కె.శ్రీదేవి, ఎల్.సంధ్య మాధురి, కె.గీత, ఎస్.భానుప్రియ; వాలీబాల్‌లో పి.నీలవేణి, ఎల్.గీత, జి.వాణిత, వి.దివ్య, కె.వసంత నందిని ఎంపికయ్యారు. 5 కి.మీ.లో బి.శ్రావణి కుమారి, 800 మీటర్లలో వి.అనిత, 400 మీటర్లలో జి.నిఖిషిత, జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో టీ.జ్యోతిక ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ డా.ఆర్.కుసుమకుమారి, వైస్ ప్రిన్సిపాల్ పి.చలపతిరావు అభినందించారు. పీడీ ఎల్.జ్యోతి, క్రీడా విభాగం సిబ్బందిని అభినందించారు.

అల్లూరి సీతారామరాజు

గన్నెల బాలికల పాఠశాలలో మహిళల రక్షణపై అవగాహన

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అరకు సీఐ ఏ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అరకులియ మండలం గన్నెల ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హైస్కూల్‌లో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి పాల్గొని మహిళా చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అరకు ఎస్సై టి.మల్లేశ్వరరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

పెదబయలులో ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ పర్యటన

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. రూడకోట పీహెచ్‌సీని సందర్శించి ఆస్పత్రి సమస్యలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జాముగూడ పంచాయతీ సాఖిరెవ్, జాముగూడ గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. రోడ్లు, తాగునీరు, సీసీ రోడ్డు, మినీ పీహెచ్‌సీ, అంగన్‌వాడీ భవనం, విద్యార్థుల వసతి సమస్యలను గ్రామస్థులు వివరించారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సాయిరామ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుడా భూషణ్‌రావు, పాంగి కామేష్, రామారావు, కొర్ర దేవా తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

కాఫీ సాగు, ఉత్పత్తులపై విద్యార్థులకు అవగాహన

అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కాఫీపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ కే. నిర్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోక్రో గ్రీన్స్ ప్రాజెక్ట్ హెడ్ కె. శ్రీనివాసరావు కాఫీ రకాలు, విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, తయారీ, నాణ్యత, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ అవకాశాలను వివరించారు. అరకు కాఫీ ప్రత్యేకతను వివరించి, తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు వై. విజయలక్ష్మి, ఎం. అనితకుమారి, బోటనీ అధ్యాపకులు బి. లచ్చన్న, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అరకు మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎంపిక

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అమరావతి ఛాంపియన్ షిప్ జిల్లా స్ధాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీ, వాలీబాల్, 5 కి.మీ., 800 మీటర్లు, 400 మీటర్ల పరుగు, జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో విద్యార్థినులు సత్తా చాటారు. కబడ్డీలో K. రాణి, P. కల్యాణి, K. శ్రీదేవి, L. సంధ్య మాధురి, K. గీత, S. భానుప్రియ; వాలీబాల్‌లో P. నీలవేణి, L. గీత, G. వాణిత, V. దివ్య, K. వసంత నందిని ఎంపికయ్యారు. 5 కి.మీ. పరుగులో B. శ్రావణి కుమారి, 800 మీటర్లలో V. అనిత, 400 మీటర్లలో G. నిఖిషిత, జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో T. జ్యోతిక ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. R. కుసుమ కుమారి, వైస్ ప్రిన్సిపాల్ పి. చలపతి రావు విద్యార్థినులను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. క్రీడా శిక్షణ అందిస్తున్న పి.డి. ఎల్. జ్యోతి, క్రీడా విభాగం సిబ్బందిని కూడా అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.