Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

అరకులోయ రైల్వే స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం కారు, ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అరకులోయ నుంచి వస్తున్న ఆటో, బైక్‌ లు, అరకు సంతబయలు నుంచి వస్తున్న కారు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ఆటో, బైక్ నుజ్జునుజ్జుకాగా, కారు రహదారి కిందకు బోల్తాపడింది. ఈ ఘటనలో మృతి చెందిన రమేష్(23) అనే వ్యక్తి డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయితీ కొత్తవలస గ్రామస్తుడిగా గుర్తించారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

అరకు: ఇస్రో విజయాలపై విద్యార్థినులకు అవగాహన

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డా. ఆర్‌. కుసుమ కుమారి నేతృత్వంలో భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన విజయాలు, చంద్రయాన్‌-3 ప్రయోగం విశేషాలు, అంతరిక్ష రంగంలో సునీతా విలియమ్స్‌ సేవలను విద్యార్థినులకు వివరించారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అధ్యాపకులు సూచించారు. డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

మారికవలస గిరిజన పాఠశాలను రద్దు చేస్తే ఊరుకునేది లేదు: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు

విశాఖపట్నం మారికవలస APTWR బాలుర పాఠశాలలో నిర్వహించిన స్కూల్ పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 480 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ప్రత్యామ్నాయ భవనం లేదా స్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని, బలవంతంగా టీసీలు ఇవ్వొద్దని కోరారు. పాఠశాల కొనసాగింపునకు తల్లిదండ్రులతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు

బాధ్యతాయుత, సుస్థిర పర్యాటక అభివృద్ధే లక్ష్యం

అరకులోయలో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు బాధ్యతాయుతమైన, సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా పర్యాటక శాఖాధికారి పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ ఆదర్శవంతమైన పర్యాటక నిర్వహణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డీఎల్పీవో కుమార్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత, పరిశుభ్రమైన పర్యాటకాన్ని కొనసాగించాలని, హోటళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో హోటల్‌ యజమానులు, రెస్టారెంట్‌ నిర్వాహకులు, ట్రావెల్‌ ఏజెన్సీలు, టూర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

ముఖ్యమంత్రి అరకు పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష

ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయ మండలంలోని గన్నెల పీహెచ్‌సీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న సంజీవని కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ టి. నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సమన్వయంతో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమ ప్రాంగణం, వేదిక, పార్కింగ్, భద్రత, తాగునీరు, విద్యుత్‌, వైద్య సేవలు, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అల్లూరి సీతారామరాజు

ముఖ్యమంత్రి అరకు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

ఆగస్టు 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అరకు ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా స్థలం, గన్నెల పీహెచ్‌సీని సందర్శించి భద్రత, పార్కింగ్, తాగునీరు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం హరిత రిసార్ట్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి. నిశాంతి, జేసీ తిరుమాణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: రూ.79 లక్షలతో నిర్మించిన రహదారి ప్రారంభం

అరకులోయ మండలం బొరాకలవలస గ్రామంలో రూ.79 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. 228 మంది జనాభా కలిగిన గ్రామానికి రహదారి అందుబాటులోకి రావడంతో రాకపోకలు సులభతరం కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయ అవసరాలకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి. నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

సుంకరిమెట్టలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం ప్రారంభించిన మంత్రి

అరకులోయ మండలం సుంకరిమెట్టలో ₹35 లక్షల ఐటీడీఏ నిధులతో నిర్మించిన ప్రసూతి నిరీక్షణ కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు ప్రసవానికి వారం రోజుల ముందుగానే సురక్షిత వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్రం లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందేలా ఇటువంటి కేంద్రాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి. నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: జోడిగుడలో అధ్వానంగా వీధి రోడ్డు

డుంబ్రిగుడ మండలం కండ్రూం పంచాయతీ జోడిగుడ గ్రామంలో వీధి రోడ్డు అధ్వానంగా మారింది. వర్షాలు కురిసిన ప్రతిసారీ రహదారి మొత్తం బురదమయంగా మారడంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి వీధిలో సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు సమస్యల పరిష్కారానికి లోకేష్‌కు సివేరి అబ్రహం వినతి

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, అరకు నియోజకవర్గ టీడీపీ యువనేత సివేరి అబ్రహం శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో లోకేష్‌ను కలిసి అరకు నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సమస్యలను సానుకూలంగా విన్న లోకేష్, సంబంధిత అంశాలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.