Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

50 ఎకరాల సాగుకు చెక్‌డ్యామ్‌ వెంటనే మంజూరు చేయాలి: సీపీఎం

అరకులోయ మండలం బొండం పంచాయతీ పరిధిలోని జయంతి వలస, రేగా, గూడ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల సాగుభూమికి నీరందించేలా కొత్త చెక్‌డ్యామ్‌ను వెంటనే మంజూరు చేసి నిర్మించాలని సీపీఎం డిమాండ్ చేసింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, సీపీఎం నాయకులు జి. చిన్నబాబు, టి. జోషిబాబు గ్రామాల్లో పర్యటించి 2014 హుదూద్ తుఫానులో కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. గతంలో నాణ్యత లోపాలతో నిర్మించడం వల్లే చెక్‌డ్యామ్ కొట్టుకుపోయిందని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చెక్‌డ్యామ్ లేకపోవడంతో రైతులు సాగునీటి కొరతతో పంటలు నష్టపోతున్నారని తెలిపారు. పదేళ్లుగా అధికారులకు, జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే నాణ్యత ప్రమాణాలతో కొత్త చెక్‌డ్యామ్‌కు నిధులు మంజూరు చేయాలని, లేకుంటే రైతులతో కలిసి మండల HMI కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

డుంబ్రిగుడ ఎంపీడీఓ కార్యాలయంలో అల్లూరి జిల్లా సైబర్ సెల్ సీఐ డి.వి. రమణ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ యాప్‌లకు స్పందించవద్దన్నారు. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పకూడదన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. స్ధానిక ఎస్ఐ ఎల్ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

డుంబ్రిగుడ ఎంపీడీఓ కార్యాలయంలో అల్లూరి జిల్లా సైబర్ సెల్ సీఐ డి.వి. రమణ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ యాప్‌లకు స్పందించవద్దన్నారు. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పకూడదన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. స్ధానిక ఎస్ఐ ఎల్ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

పంట బీమా నమోదుకు ఈ నెల 31 వరకు గడువు : అనంతగిరి ఏఓ

ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి రంగారావు సూచించారు. బీమా నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. పంట బీమా గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. మండలంలోని చిలకలగెడ్డ పంచాయితీ బూడి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తట్టుకునే పంటలు సాగు చేయాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్‌పై అవగాహన

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగం, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి మాట్లాడుతూ రొమ్ము, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తులు, నోటి, చర్మ క్యాన్సర్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పొగాకు, ధూమపానం, మద్యపానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించి చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పి. చలపతిరావు, డా. కె. రామ్‌మోహన్, రచయిత మాధవ సనా, రోటరీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్‌పై అవగాహన

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.చి.కేశవరావు ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రముఖ క్యాన్సర్ రిసోర్స్ పర్సన్ కె. రామోహన్‌రావు క్యాన్సర్‌కు కారణాలు, నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకర జీవనశైలి గురించి వివరించారు. పొగాకు, ధూమపానం, ఇతర హానికర అలవాట్లకు దూరంగా ఉండాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా.శ్యామ్‌సుందర్, జి.సత్యేంద్ర, యండమూరి పారయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయలక్ష్మి, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు దొన్నుదొర శంకుస్ధాపన

అరకులోయ మండలం, పెదలబుడు పంచాయతీ పాత పోస్టాఫీస్ వద్ద రూ.2 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర బుధవారం శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిలు, అడవి తల్లి బాటతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లోకోయి మహాదేవ్, పొద్దు అమ్మన్న, పాడి చందు నిర్మల, వంతల వెంకటరావు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి : అరకు ఎమ్మెల్యే

పాడేరు ఐటీడీఏలో 16 నెలలుగా పాలకవర్గ సమావేశం జరగకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఈ మేరకు బుధవారం అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, డోలిమోతలు వంటి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మూడు నెలలకు ఒకసారి సమావేశం జరగాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, కలెక్టర్, ఐటీడీఏ పీవో వెంటనే సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం సమీక్షలు నిరంతరం జరగాలని, ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పప్పుడువలస లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం

అరకులోయ మండలం చోంపి పంచాయతీ పప్పుడువలసలో మంగళవారం రాత్రి మండల పార్టీ అధ్యక్షుడు లొక్కోయి మహాదేవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, క్లస్టర్ కో-కన్వీనర్ కిల్లో మోహన్‌దాస్, క్లస్టర్ ఇన్‌చార్జ్ కొర్రా శేఖర్, TNSF పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జన్ని మత్య బాలరాజు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, సూపర్ సిక్స్ హామీల కింద అందుతున్న పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

అల్లూరి సీతారామరాజు

కూటమి సంక్షేమ పథకాలతో గిరిజనులకు మేలు : డా సియ్యారి దొన్నుదొర

కూటమి సంక్షేమ పథకాలతో గిరిజన కుటుంబాలకు మేలు జరుగుతోందని టీడీపీ అరకు ఇన్‌చార్జి డా. సియ్యారి దొన్ను దొర అన్నారు. మంగళవారం హుకుంపేట మండలం తాడేపుట్టు పంచాయతీ బొడ్డపుట్టులో టీడీపీ మండల అధ్యక్షుడు శతక బొంజు బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో దొన్నుదొర పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్‌ వంటి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు అధ్యక్షుడు మాతే అప్పలకొండ, క్లస్టర్‌ ఇన్‌చార్జి జన్నీ మత్స్యరాజు, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు తామర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.