Sunday, 10 May 2026
  • Home  
  • మేడిపల్లి నక్కర్త లో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు.. పాడైపోతున్న ప్రజా ఆస్తులు..
- E-పేపర్

మేడిపల్లి నక్కర్త లో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు.. పాడైపోతున్న ప్రజా ఆస్తులు..

మేడిపల్లి నక్కర్త లో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు.. పాడైపోతున్న ప్రజా ఆస్తులు..! ఏళ్ల తరబడి వినియోగం లేక ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పట్టించుకోని అధికారులు…. పున్నమి న్యూస్ ప్రతినిధి 10 మే 2026 తెలంగాణ ఇంచార్జి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా గత 10 సంవత్సరాల నుంచి గాలికి వదిలేసిన… పాలకులు ఒకప్పుడు గ్రామ ప్రజలకు సేవలు అందించిన ఈ కార్యాలయాలు ప్రస్తుతం పాడుబడి, చెత్తతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గోడలకు పగుళ్లు, పైకప్పుల నుంచి ఊడిపోతున్న సిమెంట్‌, తుప్పు పట్టిన అల్మారాలు భవనాల దుస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనాలు ప్రస్తుతం వినియోగం లేక మూతపడటంతో ప్రజా ధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ భవనాలను మరమ్మతులు చేసి ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, మహిళా సంఘ భవనాలు ఇలా అనేక నిర్మాణాలు కాలక్రమేణా నిరుపయోగంగా మారుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఈ భవనాలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

మేడిపల్లి నక్కర్త లో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు..
పాడైపోతున్న ప్రజా ఆస్తులు..!

ఏళ్ల తరబడి వినియోగం లేక ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పట్టించుకోని అధికారులు….

పున్నమి న్యూస్ ప్రతినిధి
10 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లోని మేడిపల్లి నక్కర్త
గ్రామపంచాయతీ పరిధిలోని
ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా గత 10 సంవత్సరాల నుంచి గాలికి వదిలేసిన… పాలకులు
ఒకప్పుడు గ్రామ ప్రజలకు సేవలు అందించిన ఈ కార్యాలయాలు ప్రస్తుతం పాడుబడి, చెత్తతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గోడలకు పగుళ్లు, పైకప్పుల నుంచి ఊడిపోతున్న సిమెంట్‌, తుప్పు పట్టిన అల్మారాలు భవనాల దుస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనాలు ప్రస్తుతం వినియోగం లేక మూతపడటంతో ప్రజా ధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ భవనాలను మరమ్మతులు చేసి ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, మహిళా సంఘ భవనాలు ఇలా అనేక నిర్మాణాలు కాలక్రమేణా నిరుపయోగంగా మారుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఈ భవనాలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.