Sunday, 9 August 2026
  • Home  
  • వంగ సాంబ శివ రెడ్డి మృతికి బీజేపీ నేతల సంతాపం
- ఖమ్మం

వంగ సాంబ శివ రెడ్డి మృతికి బీజేపీ నేతల సంతాపం

ఖమ్మం ఆగష్టు 9 (పున్నమి న్యూస్) నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ అధినేత వంగ సాంబ శివ రెడ్డి మృతి పట్ల బీజేపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి విద్యా రంగానికి, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, వరంగల్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. వంగ సాంబ శివ రెడ్డి విద్యా రంగంలో విశేష సేవలు అందించారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేశారని వారు గుర్తుచేశారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

ఖమ్మం ఆగష్టు 9
(పున్నమి న్యూస్)

నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ అధినేత వంగ సాంబ శివ రెడ్డి మృతి పట్ల బీజేపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి విద్యా రంగానికి, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.

బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, వరంగల్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు.

వంగ సాంబ శివ రెడ్డి విద్యా రంగంలో విశేష సేవలు అందించారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేశారని వారు గుర్తుచేశారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

విద్యారంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.