నెల్లూరు: సర్వేపల్లి డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలన్న వైసీపీ డిమాండ్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే వైసీపీ రెండు అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. గతంలో సీబీఐపై నమ్మకం లేదంటూ కోర్టుల్లో వాదనలు చేసిన వారు ఇప్పుడు అదే సంస్థతో విచారణ కోరడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. సీబీఐ దర్యాప్తు జరిగిన గత కేసుల్లో ఆ సంస్థ వెల్లడించిన అంశాలను వైసీపీ నేతలు అంగీకరించాలన్నారు. ఈ రెండు అంశాలపై స్పష్టత ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం చేస్తామని సోమిరెడ్డి పేర్కొన్నారు.

డీఎస్సీపై సీబీఐ దర్యాప్తుకు సిద్ధం: సోమిరెడ్డి