Monday, 28 September 2026
  • Home  
  • ఏటికొప్పాక పంచాయతీలో స్క్రాప్ సైకిళ్లకు బహిరంగ వేలం!
- అనకాపల్లి

ఏటికొప్పాక పంచాయతీలో స్క్రాప్ సైకిళ్లకు బహిరంగ వేలం!

రూ.1,000 డిపాజిట్‌తో అవకాశం.. బుధవారం 12 గంటలకు వేలం పాట పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) ఏటికొప్పాక: గ్రామపంచాయతీ పరిధిలో వినియోగానికి పనికిరాకుండా ఉన్న డ్రై సైకిళ్లను స్క్రాప్‌గా బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ తెలిపారు. ఈనెల 30వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,000 డిపాజిట్ చెల్లించి నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలం పాట నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే పాటదారులు నిర్ణయించిన నిబంధనల ప్రకారం బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. వేలం దక్కించుకున్న వారు పాట అనంతరం మెటీరియల్‌కు సంబంధించిన పూర్తి మొత్తాన్ని చెల్లించి, రసీదు/అనుమతులు పొందిన తర్వాత స్క్రాప్ మెటీరియల్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి పంచాయతీ కార్యాలయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనాలని కార్యదర్శి సూచించారు.

రూ.1,000 డిపాజిట్‌తో అవకాశం.. బుధవారం 12 గంటలకు వేలం పాట

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

ఏటికొప్పాక: గ్రామపంచాయతీ పరిధిలో వినియోగానికి పనికిరాకుండా ఉన్న డ్రై సైకిళ్లను స్క్రాప్‌గా బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ తెలిపారు. ఈనెల 30వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,000 డిపాజిట్ చెల్లించి నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలం పాట నిర్వహించనున్నారు.
వేలంలో పాల్గొనే పాటదారులు నిర్ణయించిన నిబంధనల ప్రకారం బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. వేలం దక్కించుకున్న వారు పాట అనంతరం మెటీరియల్‌కు సంబంధించిన పూర్తి మొత్తాన్ని చెల్లించి, రసీదు/అనుమతులు పొందిన తర్వాత స్క్రాప్ మెటీరియల్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి పంచాయతీ కార్యాలయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనాలని కార్యదర్శి సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.