Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందాలి: జీసీసీ చైర్మన్ కిడారి

పెదబయలు మండలం సీకరి పంచాయతీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని కుటుంబాలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు, వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందేలా చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ఉద్దేశ్యమని కిడారి అన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, ఆటల పోటీలు

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆగష్టు-12 జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని, స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకొని ఈ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డా కేశవరావు తెలిపారు. డా ఎస్ ఆర్ రంగనాథన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏట ఆగష్టు 12న గ్రంధాలయ దినోత్సవం జరుపుకుంటారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. బహుమతులను గ్రంధాలయ, స్వాతంత్ర్య దినోత్సవాల రోజున అందిస్తామని ఇంఛార్జ్ లైబ్రేరియన్ కే నిర్మల, ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మి చెప్పారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం

అటవీ శాఖ ఆధ్వర్యంలో అరకులోయ అల్లూరి సీతారామరాజు సి.బి.ఎస్.ఇ పబ్లిక్ స్కూల్ నందు మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగష్టు-12) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డ్ డైరెక్టర్ నాజ్ రిజ్వి, సైంటిస్ట్ డా C.R. మగేష్, అరకు FRO బొర్రా కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఏనుగుల సంరక్షణ విశిష్టతను, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఏనుగుల వేషధారణ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ సి.బి.ఎస్.ఇ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ Bh.రామకృష్ణ రాజు, ట్రెజరర్ B.V.A.R రాజు(రవి), డైరెక్టర్ మనినాయర్, ప్రిన్సిపాల్ ప్రసాద్ చంద్ర, ఎ.ఓ.సుమంత్ రాజు, పీఆర్ఓ వర్మ, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

అల్లూరి సీతారామరాజు

మెగా డీఎస్సీపై వైసీపీ చర్చకు సిద్ధమా? : జీసీసీ చైర్మన్ కిడారి

మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని, మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. వైసీపీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాడేరు లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.