నంద్యాల: అయ్యలూరు మెట్టలోని నవజీవన్ బధిరుల ప్రత్యేక పాఠశాలలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ సిస్టర్ జాన్ మేరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బధిర విద్యార్థులు వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల సంకేతాల ఆధారంగా బధిర బాలలు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పద్మావతమ్మ, రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

బధిర బాలల సందడి.. ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థాయికి ఎదగాలి: డాక్టర్ రవి కృష్ణ