అరకులోయ మండలం బొరాకలవలస గ్రామంలో రూ.79 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. 228 మంది జనాభా కలిగిన గ్రామానికి రహదారి అందుబాటులోకి రావడంతో రాకపోకలు సులభతరం కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయ అవసరాలకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ టి. నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అరకు: రూ.79 లక్షలతో నిర్మించిన రహదారి ప్రారంభం