తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి)
నగరంలోని ఆవరోడ్డులో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాత విద్యుత్ వైర్లను కాల్చుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
స్థానికుల సమాచారం మేరకు పాత విద్యుత్ వైర్లను కాల్చే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బొమ్మూరు ఎస్ఐ జాహెర్కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


