Sunday, 27 September 2026
  • Home  
  • స్నార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన MLA మట్టా రాఘమాయి దయానంద్
- ఖమ్మం

స్నార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన MLA మట్టా రాఘమాయి దయానంద్

సత్తుపల్లి / ఖమ్మం . సత్తుపల్లి మండలంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. రేజర్ల, రామగోవిందాపురం గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల కుటుంబాలకు ఆమె స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కార్డుల ప్రాధాన్యత, వాటి ద్వారా లభించే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకం గురించి కూడా వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, MRO, MPDO, రేజర్ల సర్పంచ్ భీమిరెడ్డి అరుణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, రామగోవిందాపురం సర్పంచ్ మౌనిక నరేంద్రరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సత్తుపల్లి / ఖమ్మం
.
సత్తుపల్లి మండలంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. రేజర్ల, రామగోవిందాపురం గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల కుటుంబాలకు ఆమె స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కార్డుల ప్రాధాన్యత, వాటి ద్వారా లభించే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకం గురించి కూడా వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, MRO, MPDO, రేజర్ల సర్పంచ్ భీమిరెడ్డి అరుణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, రామగోవిందాపురం సర్పంచ్ మౌనిక నరేంద్రరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.