వార్త ముఖ్యాంశాలు
- చెల్లెలి చేతి దారం అన్నయ్య ముంజేతికి చుట్టుకున్న ప్రతిసారీ...
- కాలం కూడా తలవంచేంత బలమైన ఒక అదృశ్య రక్షణ ప్రాణం పోసుకుంటుంది!
- ఈ రోజు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు జర్నలిస్టులు, కార్యకర్తలకు హెల్మెట్లు పంచుతూ..,__*రాఖీకి..!*_*_అన్నదమ్ముల ప్రాణాలను..!_**_కాపాడుకునే కానుక ఇవ్వండి..!!!_* _అని ఇచ్చిన ఆ పిలుపు, కేవలం మాటలకే పరిమితం కాకుండా నిండు వేదికపై సజీవ రూపం దాల్చింది.సత్యవతి రాథోడ్ గారి సోదరి కూతురు, మాజీ జడ్పీ చైర్పర్సన్…

చెల్లెలి చేతి దారం అన్నయ్య ముంజేతికి చుట్టుకున్న ప్రతిసారీ… కాలం కూడా తలవంచేంత బలమైన ఒక అదృశ్య రక్షణ ప్రాణం పోసుకుంటుంది! ఈ రోజు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు జర్నలిస్టులు, కార్యకర్తలకు హెల్మెట్లు పంచుతూ..,__*రాఖీకి..!*_*_అన్నదమ్ముల ప్రాణాలను..!_**_కాపాడుకునే కానుక ఇవ్వండి..!!!_* _అని ఇచ్చిన ఆ పిలుపు, కేవలం మాటలకే పరిమితం కాకుండా నిండు వేదికపై సజీవ రూపం దాల్చింది.సత్యవతి రాథోడ్ గారి సోదరి కూతురు, మాజీ జడ్పీ చైర్పర్సన్ బిందు గారు… తన సొంత అన్న, సత్యవతి గారి కుమారుడు సతీష్ గారి చేతికి కార్యకర్తలు మరియు జర్నలిస్టుల సమక్షంలో రాఖీ కట్టారు. ఆ వెంటనే గుండెనిండా ప్రేమతో.._*_నువ్వు వెళ్లే దారేదైనా..!_**_నీ ప్రయాణం ఎంత దూరమైనా..!!_**_క్షేమంగా తిరిగి రావాలన్నా..!!!🫂❤️_* _అంటూ చేతుల్లో ఒక హెల్మెట్‌ను పెట్టారు. రాఖీ అంటే కేవలం పండుగ ఆచారం మాత్రమే కాదు…అది ప్రాణాన్ని కాపాడుకునే అచంచలమైన బాధ్యత అని అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలకూ తాకింది._ _ఆడబిడ్డ మనసు కోరేది ఖరీదైన కానుకలు కాదు… తన అన్నయ్య నూరేళ్ల ఆయుషు, నిరంతర క్షేమం మాత్రమే! మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించిన ఈ ఆత్మీయ దృశ్యం… ప్రతి సోదరుడికీ హెల్మెట్ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ప్రతి అన్నాచెల్లెలి గుండెల్లో శాశ్వతంగా నాటుకుపోవాలి! 🫂✨_రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండుగ.ఈ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను కోరుకుంటుంది. సోదరుడు తన సోదరికి అండగా ఉంటానని, ఆమెకు ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తానని భరోసా ఇస్తాడు.రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు — ప్రేమ, నమ్మకం, ఆత్మీయత, బాధ్యతలతో ముడిపడిన పవిత్ర బంధానికి గుర్తు. కుటుంబ బంధాలను మరింత బలపరిచే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐక్యత, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుందాం.