Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

అర్హులైన పేద కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్హులైన పేద కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

వార్త ముఖ్యాంశాలు

  • అర్హులైన పేద కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అనర్హులకు కేటాయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్‌కు పెద్దలతండ గ్రామస్తుల విజ్ఞప్తి పెద్ద లాల్ తండ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిజమైన అర్హులకు మాత్రమే ఇళ్లు కేటాయించాలని పెద్ద లాల్…
  • గ్రామంలో పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
  • ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు, రాజకీయ ఒత్తిళ్లు, పక్షపాతానికి తావు లేకుండా గ్రామంలోని ప్రతి దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితిగతులు, సొంత ఇల్లు ఉందా లేదా అనే అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించాలని కోరుతున్నారు.

అర్హులైన పేద కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

అనర్హులకు కేటాయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్‌కు పెద్దలతండ గ్రామస్తుల విజ్ఞప్తి

పెద్ద లాల్ తండ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిజమైన అర్హులకు మాత్రమే ఇళ్లు కేటాయించాలని పెద్ద లాల్ తండ గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. గ్రామంలో పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు, రాజకీయ ఒత్తిళ్లు, పక్షపాతానికి తావు లేకుండా గ్రామంలోని ప్రతి దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితిగతులు, సొంత ఇల్లు ఉందా లేదా అనే అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించాలని కోరుతున్నారు. నిజమైన అర్హులను గుర్తించి వారికి ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు.

అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు విచారణలో తేలితే, బాధ్యులైన వారిపై మరియు తప్పుడు సమాచారం ఇచ్చి ఇళ్లు పొందిన వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు కూడా కేటాయింపుల ప్రక్రియను బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని కోరుతున్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్, మండల ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు సంబంధిత అధికారులకు ముందస్తుగా విజ్ఞప్తి చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా, పారదర్శకంగా విచారణ జరిపి న్యాయబద్ధంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని పెద్ద లాల్ తండ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *