గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. అరకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో-3కు ప్రత్యామ్నాయ జీవో, గిరిజన యువతకు 100 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాల హామీలను నెరవేర్చాలన్నారు. 1/70, ఎల్‌టీఆర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మారికవలస గిరిజన పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజనులతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గిరిజన చట్టాలు, హక్కులను పటిష్టంగా అమలు చేయాలి : రేగం చాణిక్య