వార్త ముఖ్యాంశాలు
- _సంకటాలు తొలిగించే సంకష్టహర చతుర్థి_ మంథని, ఆగస్టు 31: శ్రావణ మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనది.
- ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ గణనాథుని పూజిస్తే సంకటాలు పెరిగిపోతాయి.
- సంకష్టహర చతుర్థి సందర్భంగా సోమవారం గణనాథుని ఆలయములో భక్తులు విగ్నేశ్వరుని దర్శించుకున్నారు.
_సంకటాలు తొలిగించే సంకష్టహర చతుర్థి_
మంథని, ఆగస్టు 31:
శ్రావణ మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ గణనాథుని పూజిస్తే సంకటాలు పెరిగిపోతాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా సోమవారం గణనాథుని ఆలయములో భక్తులు విగ్నేశ్వరుని దర్శించుకున్నారు. దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ సంకష్టహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాలు తెలుపబడింది. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తీరడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయస్కారం. సంకష్టహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుని పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేసి మోదకులు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ మాసంలో వచ్చిన చతుర్థి ఎంతో విశిష్టమైనది. మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుతీరిన గణనాథున్ని సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని సోమవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గణపతికి ఇష్టమైన చవితి తిథి రోజున నవగ్రహాల్లోని కుజ గ్రహ దోషం పోవాలంటే “ఓం గం గణపతియై నమః ” అని స్మరిస్తూ విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటే అన్ని సంకటాలు తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ రోజున రాత్రి 9. 25 గంటలకు చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజ చేసి భోజనం చేయడం ఎంతో శ్రేయష్కారం. ఈ రోజున ఉపవాస దీక్ష స్వీకరిస్తే జీవితంలో ఎదుర్కొంటున్న విజ్ఞాలన్ని తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా శ్రీ మహాగణత దేవాలయాన్ని ఎంతో అందంగా అలంకరిస్తారు. దేవతలలో మొట్టమొదట పూజించబడే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విఘ్నేశ్వరున్ని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి అంతా శుభం జరుగుతుందనే విశ్వాసంతో సంకష్టహర చతుర్థి దీక్షను స్వీకరిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి ఇష్టమైన గరిక ( దూర్వాలు ) 121 సమర్పించడం అలాగే 121 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రలవుతారు అని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ రోజున చంద్రోదయం అనంతరం భోజనం చేయడం ఈ దీక్షలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలయములో భక్తుల సౌకర్యార్థం ఆలయ అర్చకులు పల్లి రాము అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.