Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీ NSS ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు ప్రారంభించారు. POP, పాదరసం, రసాయన రంగుల విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయని, మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, NSS PO లు వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు:రైతులకు ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిణీ

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ గ్రామంలో రైతులను ప్రోత్సహించేందుకు బుధవారం వలిసెలు విత్తనాలు, వంగ, బంతి, టమోటా మొక్కలను పంపిణీ చేశారు. కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వారు 35 మంది రైతులకు వీటిని ఉచితంగా అందించారు. శాస్త్రవేత్తలు డా. రాజ్‌కుమార్, డా. సత్తిబాబు పంటల సాగుపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఫణిరాజ్‌వర్మ, దశరథ్, APCNF సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

రాగి పంటలో శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు: అనంతగిరి ఏఓ

రాగి పంటలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి రంగారావు అన్నారు. బుధవారం అనంతగిరి పంచాయతీలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు కలుపు నివారణ పద్ధతులు వివరించి, తెగుళ్ల నియంత్రణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వర్ణగ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

కౌమార బాలుర సాధికారతకు నోడల్ ఉపాధ్యాయులకు శిక్షణ

కౌమార బాలురలో సానుకూల ఆలోచనా విధానం, బాధ్యతాయుత ప్రవర్తన, లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా నోడల్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో అరకులోయ లో ‘కౌమార బాలుర అభివృద్ధి, సాధికారత’పై రెండు రోజుల శిక్షణ జరిగింది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష కౌన్సిలర్లు పాల్గొన్నారు. యూనిసెఫ్ అధికారి డా. మురళీకృష్ణ, సూర్య ప్రసాద్ శిక్షణ అందించారు. అధికారులు కార్యక్రమాన్ని సందర్శించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఆరోహణ్ ఏఐ ఫెలోషిప్ 2026 శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ

పాడేరు ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు డిగ్రీ/బీటెక్ అర్హుతగల 18-28 ఏళ్ళ యువత నుండి ఆరోహణ్ ఏఐ ఫెలోషిప్ 2026 శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. శిక్షణ AI, Gen AI, Agentic AIలపై ఉంటుందన్నారు. ధరఖాస్తులను ఈ నెల 11 లోపు https://aarohan.fynityinnovations.com/register లో అప్లై చేయాలన్నారు. శిక్షణకు సంబందించిన పోస్టర్స్ స్వర్ణగ్రామ ఆఫీసులలో ప్రదర్శించాలని పంచాయితీ సెక్రటరీలకు ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు

అక్రమ అరెస్ట్‌కు గుర్తుగా 53 దీపాలతో ‘నిజం గెలిచింది’: కిడారి శ్రావణ్

తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్, గాజువాక పరిశీలకులు కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ 53 రోజుల జైలు నిర్బంధానికి గుర్తుగా 53 దీపాలు వెలిగించారు. కిడారి శ్రావణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయమని, అర్థరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు నిర్బంధించినా ప్రజల మద్దతు ఆయనకే ఉందని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ‘నాడు చీకట్లోకి నెట్టాలని చూసినా నేడు 53 దీపాల వెలుగుతో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది’ అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు అధ్యక్షత వహించారు. తహశీల్దార్ జి. రాజశ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ కె. మత్స్యరాజు, ఆర్.ఐ శంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను ప్రిన్సిపల్ వివరించారు. 01-10-2026 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని అధికారులు సూచించారు. అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, ఎన్ఎస్ఎస్ పిఓలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం సింగిల్ మేజర్‌లో సీట్లు అలాట్మెంట్ అయిన విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు తెలిపారు. మొదటి దశలో ప్రవేశాలు పొందేందుకు సెప్టెంబర్ 10వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. బీఏ పొలిటికల్ సైన్స్, బీకాం జనరల్, బీకాం సీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీలో మొత్తం 319 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాట్మెంట్ పొందిన విద్యార్థులు గడువులోగా కళాశాలలో చేరాలని ప్రిన్సిపల్ సూచించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పద్మాపురంలో రైతులకు రాజ్మా పంపిణీ

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీలో మంగళవారం 265 మంది రైతులకు రాజ్మా విత్తనాలు పంపిణీ చేశారు. 90% రాయితీతో రాజ్మా విత్తనాలు అందించినట్లు అధికారులు తెలిపారు. విత్తనాల కొరకు రైతులు ఆధార్, పోడు పట్టా జిరాక్స్, ఫోన్ నెంబర్‌తో స్వర్ణగ్రామ కార్యాలయాన్ని సంప్రదించాలని విహెచ్ఏ దశరధ్ సూచించారు. కార్యక్రమంలో విఏఏ భాను శరణ్య, విహెచ్ఏ పుణ్యావతి పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పరిశుభ్ర, బాధ్యతాయుత టూరిజమే లక్ష్యం

అరకులోయ సుంకరమెట్టలోని ప్రముఖ ఎకో టూరిజం ఉడెన్ బ్రిడ్జి వద్ద జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత, పరిశుభ్ర, స్నేహపూర్వక పర్యాటక వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. పర్యాటక కేంద్రాల్లో నెలకు ఒకరోజు స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి.ప్రసాద్, APFDC డివిజినల్ మేనేజర్ జి. కృష్ణబాబు, రేంజ్ ఆఫీసర్ కె ఆశేష, పంచాయతీ సిబ్బంది, ఎకో టూరిజం కమిటీ సభ్యులు, చిరు వ్యాపారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.