Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనకాపల్లి జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ శుక్రవారం తెలిపారు.
  • జిల్లాలోని 24 మండలాల పరిధిలో మొత్తం 642 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
  • ఇందుకోసం 6,335 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 24 మండలాల పరిధిలో మొత్తం 642 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 6,335 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,28,253 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 5,98,959 మంది పురుషులు, 6,29,277 మంది మహిళలు, 17 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో అనకాపల్లి, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 217 పంచాయతీలకు, రెండో విడతలో పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 213 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 212 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *