వార్త ముఖ్యాంశాలు
- ప్రజల ఆదరణే మా విజయానికి పునాది..
- గెలుపును గ్రామ ప్రజలకు అంకితం చేసిన నాయకులు ఏటికొప్పాక గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులను ఆదివారం సాయంత్రం గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
- జడ్పీటీసీగా విజయం సాధించిన రావి చలపతి, ఎంపీటీసీ-1గా గెలుపొందిన రాయి నాగేశ్వరరావు, ఎంపీటీసీ-2గా విజయం సాధించిన అన్నం స్వరాజ్యరావులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు.
ప్రజల ఆదరణే మా విజయానికి పునాది.. గెలుపును గ్రామ ప్రజలకు అంకితం చేసిన నాయకులు
ఏటికొప్పాక గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులను ఆదివారం సాయంత్రం గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. జడ్పీటీసీగా విజయం సాధించిన రావి చలపతి, ఎంపీటీసీ-1గా గెలుపొందిన రాయి నాగేశ్వరరావు, ఎంపీటీసీ-2గా విజయం సాధించిన అన్నం స్వరాజ్యరావులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ.. ఈ విజయం తమ వ్యక్తిగత విజయం కాదని, ఏటికొప్పాక గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందించిన అపారమైన ఆదరణ, నమ్మకం, కష్టానికి దక్కిన ఫలితమని భావోద్వేగంగా పేర్కొన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విజయాన్ని గ్రామ ప్రజలకు, కూటమి శ్రేణులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందోత్సాహాల మధ్య విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
వార్తా మూలాలు
- కె. ఆనంద్పత్రిక / వెబ్సైట్