వార్త ముఖ్యాంశాలు
- ఏటికొప్పాక గ్రామంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు.
- ఎంపీటీసీ-1 స్థానంలో టీడీపీ అభ్యర్థి రాయి నాగేశ్వరరావు 19 ఓట్ల మెజారిటీతో, ఎంపీటీసీ-2 స్థానంలో జనసేన అభ్యర్థి అన్నం స్వరాజరావు 140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
- ఎంపీపీ పదవికి టీడీపీ తరఫున పోటీ చేసిన ఇత్తంశెట్టి శ్రీలక్ష్మి 843 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఏటికొప్పాక గ్రామంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీటీసీ-1 స్థానంలో టీడీపీ అభ్యర్థి రాయి నాగేశ్వరరావు 19 ఓట్ల మెజారిటీతో, ఎంపీటీసీ-2 స్థానంలో జనసేన అభ్యర్థి అన్నం స్వరాజరావు 140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీపీ పదవికి టీడీపీ తరఫున పోటీ చేసిన ఇత్తంశెట్టి శ్రీలక్ష్మి 843 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక జడ్పీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి రావి చలపతి 8,666 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని నమోదు చేశారు.
విజయం అనంతరం గెలుపొందిన అభ్యర్థులు గ్రామ ప్రజలను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామదేవత శ్రీ బండిమాంబ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు.కూటమి అభ్యర్థుల విజయంతో ఏటికొప్పాకలో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
వార్తా మూలాలు
- కె. ఆనంద్పత్రిక / వెబ్సైట్