వార్త ముఖ్యాంశాలు
- యలమంచిలి: యర్రవరం, సింగవరం, ఏఎస్‌ఆర్ కాలనీ, పెద్దపల్లి గ్రామాలకు యలమంచిలి నుంచి రాకపోకలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారికి కౌన్సిలర్ పిట్టా శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు.
- రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రజలు, వివిధ కంపెనీలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రహదారి పొడవునా పెరిగిన తుప్పలు, లైటింగ్‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.
- ప్రజల సౌకర్యమే లక్ష్యంగా అభివృద్ధికి తొలి అడుగు వేశారు.
యలమంచిలి: యర్రవరం, సింగవరం, ఏఎస్‌ఆర్ కాలనీ, పెద్దపల్లి గ్రామాలకు యలమంచిలి నుంచి రాకపోకలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారికి కౌన్సిలర్ పిట్టా శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రజలు, వివిధ కంపెనీలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రహదారి పొడవునా పెరిగిన తుప్పలు, లైటింగ్‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రజల సౌకర్యమే లక్ష్యంగా అభివృద్ధికి తొలి అడుగు వేశారు. అదేవిధంగా రాత్రి వేళల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పిట్టా శ్రీనివాస్, జనసేన సీనియర్ నాయకులు గొర్లె సత్తిబాబు, కూటమి సభ్యులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్