చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ నిశాంతి ఆదేశాల మేరకు బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండురాజు ఆధ్వర్యంలో మూడు నెలలపాటు శిక్షణ కొనసాగనుంది. మండలంలోని 12 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థినులు ప్రతిరోజూ శారీరక దారుఢ్యానికి సమయం కేటాయించాలని సూచించారు. ఆత్మరక్షణతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శిక్షకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు
చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆత్మరక్షణ శిక్షణ