అరకులోయ, అక్టోబర్ 3: అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లను ఎంపీడీవో వీసం ప్రసాద్ శనివారం పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీవో కె.వి. సత్యనారాయణ, మండల ఇంజనీరింగ్ ఇన్‌చార్జి పైడితల్లి, ఏఓ పి. వీరభద్రరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అల్లూరి సీతారామరాజు
అరకు: కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన