Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

కిలగాడ పీహెచ్‌సీలో సేవా సంకల్ప్ అభియాన్

ముంచంగిపుట్టు: మండలం కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు గ్రామగ్రామాన ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 104 సేవల ద్వారా ప్రజలకు 24 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యుడు, సీహెచ్‌ఓ, జనసేన మండల నాయకుడు మురళి, పెసా కమిటీ చైర్మన్ సింహాచలం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

టీడీపీలో చేరిక వార్తలు అవాస్తవం – మాజీ సర్పంచ్ గొల్లూరి మొద్దు ఖండన

అరకులోయ మండలం బస్కి పంచాయతీ, గాయిబంధ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారన్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ సర్పంచ్ గొల్లూరి మొద్దు స్పష్టం చేశారు. బుధవారం వేరే పని నిమిత్తం టీడీపీ ఇంచార్జ్ డా.సియ్యారి దొన్ను దొర క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా, తమను పిలిచి బలవంతంగా పసుపు కండువాలు కప్పి ఫోటోలు తీసి ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని, కండువా వద్దని చెప్పినా వినలేదని తెలిపారు. వైసీపీలో తమకు సముచిత గౌరవం లభించిందని, జగన్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వెంటే ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావుతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. Uploaded Video:

అల్లూరి సీతారామరాజు

తారాబు జలపాతం అభివృద్ధికి రూ. 5 కోట్ల ఎంపీ లాడ్స్ తో మహా ప్రణాళిక

పెదబయలు: తారాబు జలపాతం అభివృద్ధికి రూ.5 కోట్ల ఎంపీ నిధులతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అరకు ఎంపీ డా. గుమ్మ తనూజారాణి తెలిపారు. గురువారం పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి జలపాతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకుల సౌకర్యార్థం గాజు వంతెన, టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్, పార్కింగ్, తాగునీరు, విశ్రాంతి ప్రదేశాలు, వాచ్‌టవర్, నడక మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, సూచిక బోర్డులు, చెత్త నిర్వహణ సదుపాయాలు కల్పించాలని సూచించారు. సహజత్వాన్ని కాపాడుతూ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, జర్సింగి సూర్యనారాయణ, చెట్టి వినయ్, జడ్పీటీసీ సభ్యుడు కూడా బొంజుబాబు, వొంటుభు సామ్యూల్, సింహాచలం, గంప సూరయ్య, కాతారీ సురేష్‌కుమార్, పాడి రమేష్, చెండా రవిశంకర్, టి.వెంకటరావు, కోర్ర రాజు, భాగ్యవతి, జర్సింగి బలంనాయుడు, గంగాభవాని, సూర్యనారాయణరావు, వంతల ఆనందరావు, జెండా పాపారావు, గొల్లూరి సన్యాసి, సమర్థి సూర్యం, కిముడు భాను తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

పార్టీ గెలుపు కోసం ఏకతాటిపై నడవాలి : డా సియ్యారి దొన్నుదొర

అరకులోయ: స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నడవాలని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి డా. సియ్యారి దొన్నుదొర అన్నారు. గురువారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో అరకులోయలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆశావహులు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలని, అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని దొన్నుదొర సూచించారు. ఆశావహుల పనితీరుపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే ఆధారంగా అభ్యర్థులను అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు బుద్ధ నాగ జగదీష్, ఎన్నికల పరిశీలకుడు పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, మాజీ మంత్రి మణికుమారి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఎంవీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

పాడేరు: పర్యాటక విశిష్టత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు–2025-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు సెప్టెంబరు 18లోగా దరఖాస్తు చేయాలని, పురస్కారాలు సెప్టెంబరు 27న ప్రదానం చేస్తామని తెలిపారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మహిళల భద్రతపై అవగాహన

అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ‘మహిళల భద్రత మనందరి బాధ్యత’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ మహిళలు అప్రమత్తంగా ఉండడంతో పాటు స్వీయరక్షణ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానాలను వివరించారు. సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. సీఐ బి.కోటేశ్వరరావు మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.శశికుమార్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఓజోన్ పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఓజోన్ పొర పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని ప్రిన్సిపాల్ డా. సిహెచ్. కేశవరావు తెలిపారు. రసాయనశాస్త్ర అధ్యాపకులు రమ్యశ్రీ, సురేష్, వైస్ ప్రిన్సిపాల్ కె నిర్మల, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు విజయలక్ష్మి, లచ్చన్న, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందజేయనున్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పార్టీలతో సమావేశం

అరకు వ్యాలీ, సెప్టెంబర్ 14: MPTC, ZPTC సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని MPDO సూచించారు.

అల్లూరి సీతారామరాజు

హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ రద్దు చేయాలి: కాంగ్రస్ నాయకులు వెంగడ నీలకంఠం

హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను పూర్తిగా రద్దు చేయకుండా ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో కొనసాగించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఒకే ఇంటి నంబర్‌లో వేర్వేరు పొయ్యిలతో జీవిస్తున్న కుటుంబాలను ఒకే కుటుంబంగా పరిగణిస్తే అర్హులైన వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు ఎలా అందుతాయని ప్రశ్నించారు. భూమి ఉందనే కారణంతో గతంలో తిరస్కరించిన పెన్షన్లను పునఃపరిశీలించి, స్పష్టమైన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ లేదంటూ అధికారులు ప్రజలను తిప్పి పంపుతున్న పరిస్థితిని ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పేర్లు మార్చడం కాకుండా విధానం మార్చి, వయస్సు, వాస్తవ పేదరికం, కుటుంబ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. మ్యాపింగ్ కారణంగా తిరస్కరించిన పెన్షన్లను గ్రామసభల ద్వారా పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: బాల్యవివాహాలు, టీనేజ్‌ గర్భధారణపై అవగాహన

అరకులోయ మండలం, గన్నెల ఏపీటీడబ్ల్యూఆర్‌ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్‌సీసీ) చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కంబిడి కె. కృష్ణకుమారి బాల్యవివాహాలు, టీనేజ్‌ గర్భధారణ వల్ల కలిగే అనర్థాలు, విద్య ప్రాధాన్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, హెచ్‌ఆర్‌ఏసీ అరకులోయ వైస్‌ ప్రెసిడెంట్‌ కె. సిమాచలం పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.