Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అక్టోబర్ 16న ఎస్‌ఐఆర్‌–2026 తుది ఓటర్ల జాబితా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అక్టోబర్ 16న ఎస్‌ఐఆర్‌–2026 తుది ఓటర్ల జాబితా

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, అక్టోబర్ 08: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్‌ఐఆర్‌–2026 కింద ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃపరిశీలన కొనసాగుతోందని కలెక్టర్ టి.
  • నిశాంతి, ఐఏఎస్ తెలిపారు.
  • జిల్లాలో సంబంధిత ఓటర్లకు 4,088 నోటీసులు జారీ చేయగా, 385 కేసులను ధృవీకరణకు తీసుకున్నారు.

పాడేరు, అక్టోబర్ 08: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్‌ఐఆర్‌–2026 కింద ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃపరిశీలన కొనసాగుతోందని కలెక్టర్ టి. నిశాంతి, ఐఏఎస్ తెలిపారు. జిల్లాలో సంబంధిత ఓటర్లకు 4,088 నోటీసులు జారీ చేయగా, 385 కేసులను ధృవీకరణకు తీసుకున్నారు. పరిశీలన అనంతరం 133 మందిని ASDD కింద అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగిపోకుండా, అనర్హమైన ఎంట్రీలను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అక్టోబర్ 08 నుంచి అవసరమైన ప్రాంతాల్లో BLOలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పునఃపరిశీలించనున్నారు. అర్హత ఉన్నప్పటికీ పేరు లేకుంటే Form–6 ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఎస్‌ఐఆర్‌–2026 తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *