Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, అక్టోబర్ 08: పాడేరు కాఫీ హౌస్‌ సమావేశ మందిరంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం–2007పై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
  • ముఖ్య అతిథులుగా జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి ఆర్.
  • సన్యాసినాయుడు, సబ్ కలెక్టర్ కె.

పాడేరు, అక్టోబర్ 08: పాడేరు కాఫీ హౌస్‌ సమావేశ మందిరంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం–2007పై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు, సబ్ కలెక్టర్ కె. సహిత్ హాజరయ్యారు. వృద్ధులకు ఆర్థిక భద్రత, పోషణ, గౌరవప్రదమైన జీవనం, సంక్షేమం కల్పించడంతోపాటు, వృద్ధాప్యంలో పిల్లలు నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన రక్షణ, ఆసరా కల్పించడమే చట్టం ప్రధాన ఉద్దేశమని సబ్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు కె. కవిత, PDలు జి. జయకృష్ణ, బి. బాబు, డీడీ పీబీకే నిర్మల, ఈఈ టీ. కొండయ్య పంతులు, NSS నోడల్ అధికారి జి. గౌరీశంకర్, అధికారులు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *