వార్త ముఖ్యాంశాలు
- పాడేరు, నవంబర్ 4: పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పాడేరు సబ్ కలెక్టర్ కె.
- సాహిత్ బుధవారం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి సమీక్షించారు.
- నోడల్ అధికారి, డీఆర్డీఏ పీడీ జయకృష్ణ, జడ్పీ సీఈఓ, డీఎల్పీఓలతో కలిసి పీఓలు, ఏపీఓలు, ఓపీఓల హాజరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పాడేరు, నవంబర్ 4: పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పాడేరు సబ్ కలెక్టర్ కె. సాహిత్ బుధవారం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి సమీక్షించారు. నోడల్ అధికారి, డీఆర్డీఏ పీడీ జయకృష్ణ, జడ్పీ సీఈఓ, డీఎల్పీఓలతో కలిసి పీఓలు, ఏపీఓలు, ఓపీఓల హాజరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేటాయించిన రూట్ల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు బయలుదేరే వాహనాల పురోగతి, రవాణా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. సిబ్బంది సమర్థంగా పనిచేసి పోలింగ్‌ను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ వివరాలను ప్రతి గంటకు ఒకసారి పీఓలు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పీఎంఎస్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ పి. వాసుదేవరావు, డీఎల్పీఓ పి.ఎస్. కుమార్, డీఎల్డీఓ ఎ. జయప్రకాష్ పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన