Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

పెదబయలు, ముంచంగిపుట్టు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెదబయలు, ముంచంగిపుట్టు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల తనిఖీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు, సామగ్రి పంపిణీ, కేంద్రాలకు సిబ్బంది తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు. విధులకు హాజరైన సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించిన బాధ్యతలు, పోలింగ్ నిబంధనలు, సామగ్రి వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేంద్రానికి అవసరమైన సామగ్రిని సరిచూసుకుని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేస్తూ, ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. తనిఖీల్లో రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్ పాల్గొన్నారు.

పెదబయలు, ముంచంగిపుట్టు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల తనిఖీ

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *