*విశాఖ తూర్పు కాంగ్రెస్ లో భారీ మార్పులు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
విశాఖ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించే దిశగా ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అడుగులు వేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని వార్డులలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా వ్యూహాలు చేస్తున్నారు. విద్యావంతులు, పదవి విరమణ పొందిన ఉద్యోగులు, యువత, మహిళలు, సమాజసేవకులు, ఇంజనీర్లు,డాక్టర్లు, లాయర్లు,ముఖ్యంగా నిబద్దతతో దేశానికి సేవ చేసి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, ఆర్మీ మరియు డిఫెన్సె మాజీ ఉద్యోగులను, కాంగ్రెస్ నుండి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ సరికొత్త ప్రయోగం చేయబోతోంది, ప్రజా సమస్యల పరిష్కరానికి సులువైన విధానాలు తీసుకురాబోతోంది,ప్రజా సమస్యల పై ప్రభుత్వం స్పందించక తప్పని పరిస్థితి తీసుకువచ్చేలా ప్రియాంక కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఈ సందర్బంగా ప్రజలకు పిలుపునిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. సలహాలు, సూచనలు చేయవచ్చు, ప్రజా సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్ళవచ్చు ఈ ఫోన్ / వాట్సాప్ *6305821260* లో సంప్రదించండి.


