Thursday, 9 July 2026

Blog

ఆదిలాబాదు

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కరోనా ఓపీ ఎదుట బుధవారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధ్యక్షుడు నల్ల శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగ్రే చందు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు “సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని అమలు చేసి కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడాది పాటు నిరంతరంగా పనిచేసే ప్రతి కార్మికుడికి ఒక నెల వేతనానికి సమానమైన బోనస్ ఇవ్వాలని, పండుగ సెలవులు, ఆర్జిత సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ శానిటేషన్ కార్మికులకు పేషెంట్ కేర్ విభాగంలో పదోన్నతులు కల్పించాలని కోరారు. కొత్త కాంట్రాక్టర్‌ను నియమించడంతో పాటు కార్మికులకు యూనిఫాంలు, నెలనెలా వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ తదితర హక్కులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎండి ముజీబ్, ఎస్.కె. ఇక్బాల్, దత్తాత్రి దాస్, పెందూర్ దిలీప్, నిట్టెడి నగేష్, ఇప్ప శ్రీను, జి. సంగీత, నర్సమ్మ, కమల, పద్మ, బి. లక్ష్మి, ఇర్ఫాన్, వెంకటేష్, విఠల్, సురేష్, రమేష్, పులి సునీత, రమతో పాటు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

“బూత్ బలోపేతానికి కార్యాచరణ.. మల్లారపు సంతోష్ రెడ్డి, కోడె రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ బీఎల్‌ఏల సమావేశం”

రాజన్న సిరిసిల్ల జిల్లా/ గంభీరావుపేట్ గంభీరావుపేట, జూలై 8: బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు కోడె రమేష్ అధ్యక్షత వహించారు. సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి మల్లారపు సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి బూత్‌ను బలోపేతం చేయడంతో పాటు ఓటరు నమోదు, ఓటరు జాబితాలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, సర్పంచ్ పొన్నాల మహేష్, బండ దేవయ్య, బీఎల్‌ఏ-2 సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

బూత్ నెం.6 ఓటర్లకు జనసేన యువ నాయకుడు గొంతుమూర్తి కొండయ్య నాయుడు కీలక విజ్ఞప్తి…!

అనకాపల్లి జిల్లా, జూలై 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఏటికొప్పాక గ్రామంలోని బూత్ నెం.6 ఓటర్లకు జనసేన పార్టీ యువ నాయకుడు, (BLA) గొంతు మూర్తి కొండయ్య నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. బూత్ నెం.6 పరిధిలో ఇంకా 150 ఎన్యూమరేషన్ ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఓటర్లు తమకు అందిన ఫారాలను పూర్తిగా నింపి జూలై 12లోగా సంబంధిత (BLO)కు లేదా ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో అందజేయాలని కోరారు. ఇంకా ఫారం అందని వారు వెంటనే గ్రామ సచివాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు లేక ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొంతు మూర్తి కొండయ్య నాయుడు పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల

“బూత్ బలోపేతానికి కార్యాచరణ.. మల్లారపు సంతోష్, కోడె రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ బీఎల్‌ఏల సమావేశం”

రాజన్న సిరిసిల్ల జిల్లా/ గంభీరావుపేట్ గంభీరావుపేట, జూలై 8: బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు కోడె రమేష్ అధ్యక్షత వహించారు. సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి మల్లారపు సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి బూత్‌ను బలోపేతం చేయడంతో పాటు ఓటరు నమోదు, ఓటరు జాబితాలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, సర్పంచ్ పొన్నాల మహేష్, బండ దేవయ్య, బీఎల్‌ఏ-2 సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నియామకంపై కసరత్తు యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని ముక్తకంఠంతో కోరిన నాయకులు, కార్యకర్తలు

అనపర్తి, జూలై 8 ( పున్నమి న్యూస్ ): అనపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి నియామకంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ, జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జిల నియామక ప్రక్రియలో భాగంగా, అనపర్తి నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు సురేష్ బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌కు విచ్చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశానికి అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన గ్రామశాఖ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. వీరంతా ఏకగ్రీవంగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డికి అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని పార్టీ పెద్దలను కోరినట్లు సమావేశంలో వెల్లడైంది. అనంతరం పలువురు ముఖ్య నాయకులతో పార్టీ పెద్దలు విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. సేకరించిన వివరాలను పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక రూపంలో సమర్పిస్తామని, అనంతరం పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నల్లమిల్లి కుటుంబం అందించిన సేవలను గుర్తు చేశారు. దివంగత నల్లమిల్లి మూలారెడ్డి పార్టీ అభివృద్ధికి చేసిన కృషి, అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సుమారు 12 సంవత్సరాల పాటు పార్టీ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన బీజేపీలో చేరిన అనంతరం గత రెండేళ్లుగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కార్యకర్తలను సమీకరించడం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తీరును నాయకులు ప్రశంసించారు.

రాజన్న సిరిసిల్ల

మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్‌కు ఘన నివాళులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ 08/07/2026 ముస్తాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవలు, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్మరణీయమని, ప్రజల సంక్షేమానికే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ల విజయ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరట్ల మహేష్ రెడ్డి, రంజాన్ నరేష్, ఉచిడీ బాల్‌రెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, బండారి సాయి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఎన్టీఆర్ ప్రమాద బీమా ద్వారా రూ.15 లక్షల బాండ్ల పంపిణీ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు

అనపర్తి, జూలై 8 ( పున్నమి న్యూస్ ): అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వడిశలేరు గ్రామానికి చెందిన బత్తిన చరణ్, గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన గుణపు వేణు మనోహర్, వేండ్ర గ్రామానికి చెందిన ఉప్పలగుప్త వెంకటరమణ ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ప్రమాద బీమా పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.5,00,000 చొప్పున మొత్తం రూ.15,00,000 విలువైన బీమా బాండ్లను అందజేశారు. ఈ బాండ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సురేష్, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు బాధిత కుటుంబాలకు అందజేసి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News

సోషల్ మీడియా ముసుగులో విద్వేషాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఇక కాలం చెల్లింది..!! 🛑

సోషల్ మీడియా ముసుగులో విద్వేషాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఇక కాలం చెల్లింది..!! 🛑 ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, మార్ఫింగ్ వీడియోలతో వ్యక్తిగత దూషణలకు దిగడం.. దేవుళ్లు – దేవతలను అవమానిస్తూ మతవిద్వేషాలు రేపడం, మరియు దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది..!! ఈ రకమైన తప్పుడు ప్రచారాలను అణచివేయడానికి డైనమిక్ ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారి నేతృత్వంలో ఒక “స్పెషల్ టాస్క్ ఫోర్స్” (Special Task Force) ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బృందం నేరుగా గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారి పర్యవేక్షణలో పనిచేస్తూ వారికి రిపోర్టింగ్ చేయనుంది..!! ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యాలు : ❌ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోల నియంత్రణ. ❌ క్యారెక్టర్ అస్సాసినేషన్, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు. ❌ మత భావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఉక్కుపాదం. ❌ దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా కఠిన నిఘా. సోషల్ మీడియాను ఒక ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన వేదికగా మార్చేందుకు, సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. ఇలాంటి విప్లవాత్మకమైన అడుగు వేసిన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ బాధ్యతను స్వీకరించిన ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు..!! 🤝

ఆదిలాబాదు

విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి – ఏఐవైఎఫ్ భాస్కర్

జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను వెంటనే నిలిపివేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడం, మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఎంఈవోలు, డీఈవోలు తదితర కీలక పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భవనాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఆటస్థలాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిపడా లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు, డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. విద్య ప్రతి విద్యార్థి రాజ్యాంగబద్ధ హక్కు అని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత, అందుబాటు విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం విస్మరించకుండా ప్రజలందరూ ఐక్యంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల జూలై 10న జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ప్రీతమ్, రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పారిశుద్ధ్యానికి సేవ చేసిన కార్మికుడు… ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు…!

అనకాపల్లి జిల్లా, యలమంచిలి (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామపంచాయతీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కాపారపు ఆదినారాయణ విధి నిర్వహణలో కాలికి తీవ్ర గాయమై ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పనికి వెళ్లలేక, సరైన వైద్య చికిత్స పొందలేని పరిస్థితిలో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామ పరిశుభ్రత కోసం రోజూ కాలువలు, చెత్త తొలగింపు వంటి ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస భద్రతా పరికరాలు (సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్), ఆరోగ్య రక్షణ చర్యలు, వైద్య సౌకర్యాలు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పనులు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య సమస్యలతో విధులు మానేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. గాయపడిన కాపారపు ఆదినారాయణకు తక్షణ వైద్య చికిత్స, ఆర్థిక సహాయం అందించడంతో పాటు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.