ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత యూనిఫాంలను పంపిణీ చేసింది. ఆత్మకూరు మండలంలోని 69 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4,675 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు జతల యూనిఫాంలను అందజేసినట్లు మండల ఎంఈఓ సీహెచ్ అనంతలక్ష్మి తెలిపారు. విద్యార్థులు ఆనందంగా యూనిఫాంలను స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాంలతో పాటు స్కూల్ బ్యాగులు, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు ఉచితంగా అందిస్తున్నారు.
ఆత్మకూరు: ఒక్కొక్కరికి మూడు జతల యూనిఫాం