మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ ప్రాంతంలో మట్టి గణపతులను తయారు చేస్తున్న కేంద్రాన్ని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ సందర్శించారు. గత 30 ఏళ్లుగా మట్టి గణపతులను తయారుచేయడం అభినందనీయమని గంగాధర్ ను ప్రశంసించారు. మట్టి గణపతులను నైపుణ్యంతో కళాత్మకంగా రూపొందిస్తున్న తీరు గొప్పదని అభివర్ణించారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడుకుందాం అని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాబోయే వినాయక చవితికి ప్రతి ఒక్కరు మట్టి గణపతిని ఆరాధించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, క్రాంతి, నారా గౌడ్, దినేష్, కరాటే భోజన్న, గట్టడి పవన్, తదితరులు పాల్గొన్నారు.



