Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

పచ్చని క్యాంపస్‌.. పరిశుభ్రమైన క్యాంపస్‌.. నెట్‌జీరో దిశగా అడుగులు నెట్‌జీరో లక్ష్యంలో భాగంగా ఏపీఆర్‌జేసీలో పరిశుభ్రతా కార్యక్రమాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి, ఆగస్టు 25: విజయపురిసౌత్‌లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.
  • ఎం.
  • హేమాంబర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ సమన్వయంతో పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి, ఆగస్టు 25:

విజయపురిసౌత్‌లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఎం. హేమాంబర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ సమన్వయంతో పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

“పరిశుభ్రమైన క్యాంపస్‌ – పచ్చని క్యాంపస్‌ – నెట్‌జీరో వైపు అడుగులు” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని కళాశాల ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.

సేకరించిన వ్యర్థాలను వేర్వేరు డస్ట్‌బిన్‌లలో వేయడంతో పాటు వ్యర్థాల విభజన, సరైన నిర్వహణపై అవగాహన కల్పించారు. నెట్‌జీరో లక్ష్య సాధనలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను ప్రతి నెలా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హేమాంబర రెడ్డి తెలిపారు.

ప్రతి విద్యార్థి పరిశుభ్రతను తన బాధ్యతగా భావించి కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన క్యాంపస్‌ సాధనలో పారిశుద్ధ్య సిబ్బంది సేవలు కీలకమని పేర్కొంటూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ సభ్యులు, బోధనా, బోధనేతర సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *