Thursday, 4 June 2026
  • Home  
  • ఘనంగా గిరిజన నృత్య ఉత్సవాలు- సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ప్రజా సాధికారిక ట్రస్ట్
- తిరుపతి

ఘనంగా గిరిజన నృత్య ఉత్సవాలు- సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ప్రజా సాధికారిక ట్రస్ట్

శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) : చిత్తూరు, తిరుపతి జిల్లాలలో సాంస్కృతిక వికాసానికి, గిరిజన కళాకారుల ప్రోత్సాహానికి ప్రజా సాధికారిక ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ ఎం. బాలాజీ నాయక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ప్రజా సాధికారిక ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఎస్టీ కాలనీలో గిరిజన నృత్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారులు తమ సాంప్రదాయ నృత్యాలతో ప్రేక్షకులను అలరిస్తూ, తమ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ట్రస్ట్ చైర్మన్ ఎం. బాలాజీ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన కళలు మన సంస్కృతికి మూలస్తంభాలని, వాటిని పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిరిజన యువత, విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకే ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు. మరో అతిథి, కళాకారుల సంఘం అధ్యక్షుడు కోటయ్య మాట్లాడుతూ గిరిజనులు అన్ని రంగాల్లో చైతన్యవంతులుగా ఎదిగి ఆర్థిక ప్రగతి సాధించాలని, వారి కళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షించారు. అనంతరమ సంస్థ కోఆర్డినేటర్లు సురేష్, ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే ఉత్సవాల్లో వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.