Thursday, 16 July 2026
  • Home  
  • ఖరీఫ్ పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలి….అఖిల భారత కిసాన్ మహాసభ డిమాండ్.
- నంద్యాల

ఖరీఫ్ పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలి….అఖిల భారత కిసాన్ మహాసభ డిమాండ్.

మిడుతూరు మండల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న,పత్తి,మినుములు,సోయాబీన్, పప్పుధాన్యాల పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులను ఆదుకోవాలని అఖిల భారత కిసాన్ మహాసభ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు వ్యవసాయ శాఖ ఏడీఏ గిరీష్,టెక్నికల్ అసిస్టెంట్ సర్వేశ్వర్ రెడ్డి,మిడుతూరు ఏఏవో పీర్ నాయక్ వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ … 2026 ఖరీఫ్‌లో రైతులు జూన్ నెలలో మొక్కజొన్న,పత్తి,మినుములు,సోయాబీన్,పప్పుధాన్యాల పంటలను విస్తృతంగా సాగు చేశారని,వర్షాభావం,ఈదురుగాలుల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, తక్కువ వర్షపాతం కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ,రైతులే సొంతంగా బీమా చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం విచారకరమని,పత్తి ఎకరాకు రూ.1,600/-,మొక్కజొన్నకు రూ.660/-,మినుములు,పప్పుధాన్యాలకు కూడా బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సి రావడం అన్యాయమని,ఇప్పటికే రైతులు అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులు తెచ్చి పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టారని,ఇప్పుడు బీమా భారాన్ని కూడా వారిపైనే మోపడం “మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు”గా ఉందని విమర్శించారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లించి,ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మహాసభ జిల్లా నాయకులు వేల్పుల ఏసన్న,ప్రసాదు, వడ్డే సుధాకర్,కార్మిక సంఘం నాయకులు టి.నరసింహులు,కాటేపోగు సోమన్నలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.