జనగామ జిల్లా:
సముద్రాల నుండి కోమటిగూడెం, రంగరాయిగూడెం మీదుగా జనగామకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్ మార్పు విద్యార్థులకు శాపంగా మారింది. గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సు స్థానంలో ఎక్స్ప్రెస్ బస్సును నడుపుతుండడంతో పాటు, ఆ బస్సు నేరుగా జనగామకు వెళ్లకుండా నర్మెట వెళ్లి వస్తుండడంతో విద్యార్థులు సమయానికి కాలేజీలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఈ ప్రయాణ మార్పు వల్ల ప్రయాణ సమయం విపరీతంగా పెరుగుతుండగా, మరోవైపు పల్లె వెలుగు బస్సు ప్లేసులో ఎక్స్ప్రెస్ బస్సు నడపడం వల్ల విద్యార్థులకు ఉచిత బస్సు పాస్లు వర్తించక, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తీవ్ర సమస్యలపై కోమటిగూడెం గ్రామ సర్పంచ్ పనికర సోమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్థులు, వార్డు సభ్యులు అందరూ కలిసి బస్సు ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థుల చదువుకు కలుగుతున్న ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పాత రూట్లోనే బస్సును నడిపేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

జనగామ రూట్ బస్సు మార్పుపై నిరసన: విద్యార్థులు, గ్రామస్థుల ఆందోళన
జనగామ జిల్లా: సముద్రాల నుండి కోమటిగూడెం, రంగరాయిగూడెం మీదుగా జనగామకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్ మార్పు విద్యార్థులకు శాపంగా మారింది. గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సు స్థానంలో ఎక్స్ప్రెస్ బస్సును నడుపుతుండడంతో పాటు, ఆ బస్సు నేరుగా జనగామకు వెళ్లకుండా నర్మెట వెళ్లి వస్తుండడంతో విద్యార్థులు సమయానికి కాలేజీలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రయాణ మార్పు వల్ల ప్రయాణ సమయం విపరీతంగా పెరుగుతుండగా, మరోవైపు పల్లె వెలుగు బస్సు ప్లేసులో ఎక్స్ప్రెస్ బస్సు నడపడం వల్ల విద్యార్థులకు ఉచిత బస్సు పాస్లు వర్తించక, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీవ్ర సమస్యలపై కోమటిగూడెం గ్రామ సర్పంచ్ పనికర సోమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్థులు, వార్డు సభ్యులు అందరూ కలిసి బస్సు ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థుల చదువుకు కలుగుతున్న ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పాత రూట్లోనే బస్సును నడిపేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

